ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ 3 రాష్ట్ర రోడ్లను హైవేలు చెయ్యండి

ABN, Publish Date - Sep 25 , 2024 | 03:37 AM

వికారాబాద్‌ నియోజకవర్గం మీదుగా వెళ్లే మూడు ‘రాష్ట్ర రహదారులను’ జాతీయ రహదారులగా అప్‌గ్రేడ్‌ చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల

వికారాబాద్‌లో రహదారుల అభివృద్ధికి నిధులివ్వండి.. కేంద్ర మంత్రి గడ్కరీకి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ విజ్ఞప్తి’8 ఎన్‌హెచ్‌ 63 విస్తరణకు

100 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే వివేక్‌

వికారాబాద్‌, సెప్టెంబరు24 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ నియోజకవర్గం మీదుగా వెళ్లే మూడు ‘రాష్ట్ర రహదారులను’ జాతీయ రహదారులగా అప్‌గ్రేడ్‌ చేయాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. అలాగే, వికారాబాద్‌ నియోజకవర్గంలోని మరో ఏడు రహదారుల అభివృద్ధికి నిధులు మం జూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రిని ఢిల్లీలో మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కోకాపేట్‌ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌-శంకర్‌ప ల్లి-మోమిన్‌పేట్‌-మర్పల్లి-బుదేరా రోడ్డు, తాండూరు-పెద్దేముల్‌-కోట్‌పల్లి-మోమిన్‌పేట్‌-సదాశివపేట రోడ్డు, వికారాబాద్‌-మోమిన్‌పేట్‌ రోడ్లను హైవేలుగా అభివృద్ధి చే యాలని విన్నవించారు. అలాగే, సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్స్‌ పథకం(సీఆర్‌ఐఎఫ్‌) కింద తాండూరు- ధారూరు రోడ్డుకు రూ.45 కోట్లు, కొత్తగడి-బంట్వారం రోడ్డుకు రూ.50 కోట్లు, కేసారం-తొరమామిడి రోడ్డుకు రూ.60కోట్లు, వికారాబాద్‌- ధారూరు రైల్వేస్టేషన్‌ రోడ్డుకు రూ.55 కోట్లు, బషీరాబాద్‌-మైల్వార్‌ రోడ్డుకు రూ.35 కోట్లు, మారేపల్లి-మదనాంతపూర్‌ రోడ్డుకు రూ.40 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు-రాంపల్లి-బంట్వారం రోడ్డుకు రూ.30 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఎన్‌హెచ్‌- 63 విస్తరణ, కొత్త రహదారి నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూ. 100 కోట్లు మంజూరు చేసిందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మరోపక్క, ఢిల్లీ పర్యటనలో ఉన్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.


సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం

న్యూఢిల్లీ, సెప్టెంబరు24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సుస్థిరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటున్నాయని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన పదో కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ ఇండియా రీజియన్‌ సదస్సులో ‘సుస్థిరాభివృద్ధిలో శాసన వ్యవస్థల పాత్ర’ అంశంపై గడ్డం ప్రసాద్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్థిరమైన అభివృద్థి కోసం తెలంగాణ శాసనసభ రూపొందించిన చట్టాలే వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టాయని తెలిపారు. ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేయడం రాష్ట్రంలో అన్ని వర్గాల సాధికారతకు ఉపయోగపడిందని పేర్కొన్నారు.

Updated Date - Sep 25 , 2024 | 03:37 AM