ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీసీల సమావేశాన్ని విజయవంతం చేయాలి

ABN, Publish Date - Nov 25 , 2024 | 12:31 AM

బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ నెల 25న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించనున్న రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మినారాయణలు పిలుపునిచ్చారు.

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు

బీసీల సమావేశాన్ని విజయవంతం చేయాలి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు యాదగిరి

నల్లగొండ టౌన, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ నెల 25న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో నిర్వహించనున్న రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మినారాయణలు పిలుపునిచ్చారు. ఆదివారం సంఘం కార్యాలయంలో సమావేశ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిసెంబరు 23న ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు రాత్రికి రాత్రే ప్రవేశపెట్టి 10శాతం లేని వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకురావడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయాలని, రెండు శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదన్నారు. బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వంగూరు నారాయణ యాదవ్‌, బత్తుల శ్రీనివాస్‌, తిరందాసు రామదాసు, మునాస ప్రసన్నకుమార్‌, గుండు వెంకటేశ్వర్లు, చెన్నూరి భరద్వాజ్‌, వల్ల కీర్తి శ్రీనివాస్‌, మోదాల శ్రీనివాస్‌ యా దవ్‌, వడ్డెబోయిన రామకృష్ణ, తిరుపతయ్య గౌడ్‌, మంగళ పిల్లి శంకరయ్య, అల్లి చంద్రయ్య, తాళ్ల భద్రయ్య, గడ్డం దశరథ యాదవ్‌, పలనాటి మోహన, దుడుకు తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:31 AM