చెడుపై మంచి సాధించిన విజయం
ABN, Publish Date - Oct 10 , 2024 | 11:39 PM
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటు న్నామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
- ఎస్పీ శ్రీనివాసరావు
- సాయుధ దళ కార్యాలయంలో ఆయుధ పూజ
గద్వాల క్రైం, అక్టోబరు 10 : చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటు న్నామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఆయుధ, వాహన పూజలకు ఆయన సతీ సమేతంగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ప్రతీ సంవత్సరం దసరా పండగకు ముందు ఆయుధ పూజ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. సమాజంలో చెడును పారదోలేందుకు పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. పోలీస్ సిబ్బందికి, ప్రజలకు ముందుస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సాయుధ దళ డీఎస్పీ సురేందర్‌రావు, కార్యాలయ ఏవో సతీశ్‌కుమార్, ఆర్‌ఐలు వెంకటేశ్, హారిఫ్, సీఐ నాగేశ్వర్‌రెడ్డి, రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Oct 10 , 2024 | 11:39 PM