సీనియర్ సిటిజన్స్ సేవలు అమూల్యం
ABN, Publish Date - Dec 17 , 2024 | 11:19 PM
సీనియర్ సిటిజన్స్ సమాజానికి అమూల్యమైన సేవలందించారని ఎస్పీ జానకి అన్నారు.
- ఎస్పీ జానకి
పాలమూరు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : సీనియర్ సిటిజన్స్ సమాజానికి అమూల్యమైన సేవలందించారని ఎస్పీ జానకి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోస్ భవనంలో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆఽధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ పాల్గొని, మాట్లాడారు. సీనియర్ సిటిజన్స్ అనుభం, జ్ఞానం యువతకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. సీనియర్ సిటిజన్స్ భద్రత, సంక్షేమం కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఎలాంటి సమస్యలైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చు అన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ ఎస్పీని సన్మానించారు. అంతకుముందు 2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జి.సాయిలుగౌడ్, నందు, విజయకుమార్, వరప్రసాద్, రాజయ్య, జగపతిరావు, రాజేందర్‌రెడ్డి హాజరయ్యారు.
Updated Date - Dec 17 , 2024 | 11:19 PM