ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN, Publish Date - Mar 30 , 2024 | 11:08 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తున్న గ్యారెంటీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు గడ్డపై పార్టీ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కేఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బూత్‌ లెవల్‌ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

గద్వాల, మార్చి 30: కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తున్న గ్యారెంటీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు గడ్డపై పార్టీ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కేఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బూత్‌ లెవల్‌ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పదేళ్లుగా పాలన నిర్వహించి కొందరి వ్యాపారవేత్తల లాభాపేక్ష కోసం నిర్ణయాలు తీసుకుందని అన్నారు. పేద ప్రజలు, మహిళలు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టిందన్నారు. ప్రజల నుంచి పన్నులను వసూలు చేసి, వ్యాపారవేత్తలకు రాయితీలు ఇచ్చిందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేరుస్తున్నాయన్నారు. ఆరు గ్యారెంటీలలో తెలంగాణలో ఇప్పటికే నాలుగింటిని అమలు చేస్తున్నామని వివరించారు. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీకి ఓట్లు వేయించాలని బూత్‌ కన్వీనర్లకు చెప్పారు. బీజేపీ వాళ్ల మాటలకు ప్రజలు మోసపోకుండా వారికి అర్థమయ్యేలా వివరించి మల్లు రవి గెలుపునకు కృషి చేయాలని వివరించారు. అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 రోజుల పాలనలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రె్‌సదేనని అన్నారు. దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రాహుల్‌ ప్రధానమంత్రి అవుతారని అన్నారు. సీడబ్ల్యూసీ మెంబర్‌ కొప్పుల రాజు, ఏఐసీసీ మెంబర్‌ రోహిత్‌ చౌదరీ పలు గ్యారెంటీ పథకాలను ప్రొజెక్టర్‌ ద్వార వివరించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, సీనియర్‌ నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, గంజిపేట శంకర్‌ పాల్గొన్నారు.

రసాభాస

శిక్షణ శిబిరం చివరలో రసాభాస చోటుచేసుకుంది. ఉమ్మడి జిల్లా మాజీ ప్రజా ప్రతినిధి బండారు భాస్కర్‌ తనకు మైకు ఇవ్వలేదని, తనను స్టేజీమీదకు ఆహ్వానించలేదని అలంపూర్‌కు చెందిన మాజీ ప్రజా ప్రతినిధిపై గరంగరం అయ్యారు. మాటమాట పెరగడంతో తోపులాటకు దారితీసింది. దీంతో సహనం కోల్పోయిన కార్యకర్తలు బండారి భాస్కర్‌ను తోసుకుంటూ మీదకు వెళ్లారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో తోపులాటలో భాస్కర్‌ కిందపడిపోయారు. ఓ కార్యకర్త చేయి చేయి చేసుకున్నారు. స్టేజీ మీద ఉన్న మంత్రి, జడ్పీ చైర్‌పర్సన్‌, ఏఐసీసీ పెద్దలు మైకులో పదేపదే కలగజేసుకొని హెచ్చరించడంతో కార్యకర్తలు శాంతించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వచ్చింది.

Updated Date - Mar 30 , 2024 | 11:08 PM

Advertising
Advertising