ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పొగాకు సాగు లాభాలు బాగు

ABN, Publish Date - Nov 01 , 2024 | 11:45 PM

పొగాకు పంటకు డిమాండ్‌ ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు విస్తీర్ణంలో సాగు చేశారు.

- క్వింటాలుకు రూ. 15 వేలు పలుకుతోంది

- ధర పెంచడంతో పెరిగిన సాగు విస్తీర్ణం

ఇటిక్యాల, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పొగాకు పంటకు డిమాండ్‌ ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు విస్తీర్ణంలో సాగు చేశారు. పదేళ్లుగా ధర లభించకపోవడంతో రైతులు ఆసక్తి చూపలేదు. గతేడాది ఆయా కంపెనీల తరపున కొనుగోలు దారులు గ్రామాలకు వచ్చి క్వింటాలుకు ధర రూ.15 వేలు చెల్లించి వారే తీసుకెళ్లారు. అంతేకాకుండా పొగాకు మొక్కకు ఉన్న చివరి ఆకు సైతం కొనుగోలు చేశారు. దీంతో రైతులు పొగాకు సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలంలో ఉదండాపురం, చాగాపురం, ఇటిక్యాల, పెద్దదిన్నె, షాబాద, బట్లదిన్నె, వేముల, తదితర గ్రామాల్లో నల్లరేగడి భూములు ఉన్న రైతులు పొగాకు పంట సాగు చేశారు. అలంపూరు నియోజక వర్గంలో మానవపాడు, అలంపూరు, ఇటిక్యాల మండలాల్లో అధికంగా నల్లరేగడి భూములు ఉండటం పెట్టుబడి సైతం తక్కువగా వుంటుందని, మంచి ధర లభిస్తుందని సాగుకు మొగ్గుచూపారు. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి అవుతుందని, మొదట మొక్క నాటిన తరువాత మిడత రాకుండా చర్యలు తీసుకొని, రెండు నెలల తరువాత లద్దెపురుగు ఆశించకుండా జాగ్రతలు తీసుకుటేఏ పంటకు ఎలాంటి దిగులు ఉండదని రైతులు తెలిపారు. నియోజక వర్గంలో మొదటి నుంచి నాటు పొగాకు సాగు చేస్తుండగా గత కొంత కాలం నుంచి బీడి పొగాకు, సిగరెట్‌ పొగాకు పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సమాచారం మేరకు గతేడాది జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,300 ఎకరాలలో సాగుచేయగా.. ఈ ఏడాది పదివేల ఎకరాల్లో సాగు చేశారు.

ఎనిమిది ఎకరాల్లో సాగు చేశాను

గతేడాది ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పొగాకు పంట సాగు చేశాను. ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ధర మంచిగా ఇవ్వడంతో ఈ ఏడాది ఎనిమిది ఎకరాలు కౌలు తీసుకొని సాగుచేశాను. గతేడాది క్వింటాలుకు రూ.15 వేలు పలికింది. ఈ ఏడాది ప్రస్తుతం పంట బాగుంది. దిగుబడి కూడా బాగానే ఉంటుందని ఆశిస్తున్నాం.

- ఈదన్న, కౌలురైతు

ఈ ఏడాది పంట బాగుంది

మూడు ఎకరాలలో పొగాకు పంట సాగు చేశాను. గత ఏడాది దిగుబడి బాగానే వచ్చింది మంచి లాభాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా వర్షాలు అనుకూలించడంతో పంట బాగుంది. గతేడాది మాదిరిగానే ధర లభిస్తే మంచి లాభాలు వస్తాయని అనుకుంటున్నాం.

- నర్సింహులు, పొగాగు రైతు, ఇటిక్యాల

Updated Date - Nov 01 , 2024 | 11:45 PM