ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:07 PM
నిత్యం ప్రజల కోసమే జీవిస్తానని, వారి సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నాడు.
ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్ చౌరస్తా, నవంబరు 25, (ఆంధ్రజ్యోతి) : నిత్యం ప్రజల కోసమే జీవిస్తానని, వారి సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నాడు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలులోని చల్లా బంగ్లాలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు అందజేశారు. అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.7.62 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. మానవపాడు మాజీ ఎంపీపీ అశోక్‌రెడ్డి, దాయోదర్‌రెడ్డి, గొల్లవెంకట్రాముడు, ఎన్. మహేష్, రవి, బోరవెళ్లి సత్యరెడ్డి ఉన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన జీవో 317 బాధితులు
జీవో 317 బాధితుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఎమ్మెల్యే విజయుడును కలిశారు. గతంలో మాకు న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం సబ్ కమిటీ వేసిన దీనివల్ల ఒరిగిందేమి లేదని, స్థానికత ప్రకారం మమ్మల్ని తిరిగి బదిలీలు అయ్యేలా అసెంబ్లీలో చర్చించాలని ఎమ్మెల్యేను కోరారు. కలిసినవారిలో నిజామాబాద్‌కు బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులు రాఘవేంద్రగౌడు, రవిప్రకాష్‌రెడ్డి, మనోహర్, రాములు, వెంకటేశ్వర్లు, సింగోటం, ప్రభాకర్ ఉన్నారు.
Updated Date - Nov 25 , 2024 | 11:07 PM