మహబూబ్‌నగర్‌లో క్రీడా సంబురం
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:30 PM
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి క్రీడా సంబురానికి వేదికానుంది.
- నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఖోఖో టోర్నీ
-పాల్గొనున్న 10జిల్లాలు, 360 మంది క్రీడాకారులు
-టోర్నీని ప్రారంభించనున్న ప్రజాప్రతినిధులు
-ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వహకులు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, అక్టోబర్ 27 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి క్రీడా సంబురానికి వేదికానుంది. నేటి నుంచి మహబూబ్‌నగర్ స్టేడియం మైదానం, ఇండోర్‌స్టేడియంలో నేటి నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర అంతర్‌జిల్లాల బాల, బాలికల ఖోఖో టోర్నీ జరగనున్నది. మూడు రోజుల పాటు పట్టణ ప్రజలకు కనువిందు చేయనున్నారు. జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి విలియం టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. బాలికలకు మాడ్రన్ స్కూల్, బాలురకు చైతన్య, బీపీహెచ్‌ఎస్‌స్కూల్, స్టేడియంలో బస, బాలభవన్‌లో భోజన వసతి కల్పిస్తున్నారు.
పాల్గొననున్న 10 జిల్లా జట్లు...
తెలంగాణ రాష్ట్ర అంతర్‌జిల్లాల బాల, బాలికల ఖోఖో టోర్నీలో రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి 360 మంది క్రీడాకారులు, ఆఫీషియల్స్ పాల్గొనున్నారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జట్లు పాల్గొనున్నాయి. తెలంగాణ రాష్ట్ర అంతర్‌జిల్లాల బాల, బాలికల ఖోఖో పోటీలకు ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ సలహాదారులు ఏపీ జితేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దేవకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అరునిధ్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నారు.
టోర్నీకి ఏర్పాట్లు పూర్తి....
తెలంగాణ రాష్ట్ర అంతర్‌జిల్లాల బాల, బాలికల అండర్-16 బాల,బాలికల ఖోఖో టోర్నీకి స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. 10 జిల్లాల నుంచి 360 మంది క్రీడాకారులకు, ఆఫిషియల్స్‌కు బస, భోజన వసతికి కల్పిస్తున్నాం. టోర్నీని అందరి సహకరంతో విజయవంతంగా నిర్వహిస్తాం.
- జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి విలియం
Updated Date - Oct 27 , 2024 | 11:30 PM