అర్హులందరికీ పథకాలు అందించాలి
ABN, Publish Date - Oct 16 , 2024 | 11:02 PM
అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు వర్తింపజేయాల ని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు వర్తింపజేయాల ని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో పౌర సరఫరాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని మండల అభివృద్ధి కార్యాలయాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్‌లో ఒక ప్రజా పాలన కేంద్రం పని చేస్తోందని, ఇందుకు సంబంధించిన మార్గనిర్దేశాలను కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలియజేశారు. అర్హులందరికీ పథకాలు వర్తింపజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, సివిల్ సప్లయ్ అధికారి కాశీవిశ్వనాథ్, డీఎం, డీటీలు పాల్గొన్నారు.
Updated Date - Oct 16 , 2024 | 11:02 PM