ఆదర్శమూర్తి సావిత్రి బాయి ఫూలే
ABN, Publish Date - Jan 03 , 2024 | 11:06 PM
సావిత్రి బాయి ఫూలే నేటి తరం మహిళలకు ఆదర్శమని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత కొనియాడారు. సావిత్రి బాయి ఫూలే జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
- జడ్పీ చైర్‌పర్సన్ సరిత
- జిల్లా వ్యాప్తంగా సావిత్రి బాయి జయంతి వేడుకలు
- నివాళి అర్పించిన ప్రజాప్రతినిధులు, పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు
గద్వాల టౌన్, జనవరి 3 : సావిత్రి బాయి ఫూలే నేటి తరం మహిళలకు ఆదర్శమని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత కొనియాడారు. సావిత్రి బాయి ఫూలే జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆమెకు నివాళి అర్పించారు. గద్వాల పట్టణంలోని 22వ వార్డు లో స్థానిక కౌన్సిలర్ అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో చైర్‌పర్సన్ సరిత పాల్గొన్నారు. సావిత్రి బాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అనంతరం కాలనీలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నాయకులు నరసింహులు, మధుసూదన్‌బాబు, శేషన్న, చిన్నయ్య, పెద్దలక్ష్మణ్, పరుశ, జమ్మిచేడు ఆనంద్, వెంకట్రాములు, ఆనంద్ గౌడ్, ధరూరు రవి, ప్రత్యేక అధికారి ఎల్లారెడ్డి, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
- సావిత్రి బాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ లవీన మంజులత, కృష్ణమూర్తి, నరసింహులు, నాగభూషణం, కరుణాకర్, వెంకటేశ్వరమ్మ, పద్మ, విజయలక్ష్మి, వినోద్, కళాశాల ఏఓ మక్బూల్ అహ్మద్, సూపరింటెండెంట్ రమేష్ పాల్గొన్నారు.
- గద్వాల పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఐద్వా జిల్లా కార్య దర్శి నర్మద, పద్మ, జ యమ్మ, రేవతి, స్రవంతి, మేఘ న, వెంకటమ్మ, మనెమ్మ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థిని ఒకరు సావిత్రిబాయి పూలే విషధారణలో అందరినీ ఆకట్టుకున్నది. అనంతరం ఉపాధ్యాయి నులను ఘనంగా సన్మానించారు. ప్రజా, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తా లోని జ్యోతిబా ఫూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
మహిళా లోకానికి ఆదర్శం
వడ్డేపల్లి : దేశంలో తొలి మహిళా గురువుగా బాలి కల చదువుకు శ్రీకారం చుట్టిన సావిత్రి బాయి ఫూలే మహిళా లోకానికి ఆదర్శమని ఇన్‌చార్జి ప్రధానోపాధ్యా యుడు హారున్ రషీద్ అన్నారు. సావిత్రి భాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని బుధవారం వడ్డేపల్లి మండలం రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఉపాధ్యాయినులు సురేఖ, ధనలక్ష్మి, వసంతలను ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జీవన్‌కుమార్, దేవేందర్ రెడ్డి, మధు, రామాంజనేయులు, సాయి బాబా, శ్రీహరి పాల్గొన్నారు.
ఇటిక్యాల : మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, మండల ంలోని మునగాల ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు నిర్వహిం చారు. ఆమె చిత్రపటానికి ప్రిన్సిపాల్ తిరుపతయ్య, మునుగాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్, ఉపాద్యాయులు కరుణాకర్ పాల్గొన్నారు.
సావిత్రి బాయి సేవలు మరువలేనివి
అలంపూర్ : సావిత్రి బాయి సేవలు మరువలేని వని వక్తలు కొనియాడారు. అలంపూర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఉండవల్లి : మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో సావిత్రి బాయి చిత్రపటానికి సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మద్దిలేటి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండ ల కన్వీనర్ వెంకటేశ్వర్లు, నాయకులు వెంకట్రాముడు, అంజి, ఈరన్న, శేఖర్, వెంకటేష్, పెద్ద రాముడు, నాగరాజు, లక్ష్మన్న పాల్గొన్నారు.
రాజోలి : రాజోలి మండలంలోని తూర్పు గార్లపాడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు బీసన్న ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఖలీమ్, పాఠశాల చైర్మన్ శోభన్, యూత్ అధ్యక్షుడు అనిల్, సభ్యులు ప్రవీణ్, పవన్, ప్రేమరాజు, మత్తన్న పాల్గొన్నారు.
ఆశయ సాధనకు కృషి
అయిజ : సావిత్రి బాయి ఫూలే ఆశయ సాధనకు కృషి చేయాలని సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు సంకాపూర్ రాముడు అన్నారు. పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టి కార్యాలయంలో సావిత్రిబాయి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, దాబా మోహన్ పాల్గొన్నారు.
గట్టు : మండలంలోని బల్గెరలోని ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ హన్మంతునాయుడు ఆధ్వర్యంలో సావిత్రి బాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గట్టు గ్రామపంచాయతీ వద్ద కేవీపీఎస్ మండల అధ్యక్షుడు మారెప్ప, సీఐటీయూ మండల కార్యదర్శి వీవీ నర్సింహ, ఐద్వా కార్యదర్శి నర్మద, వీరేష్‌సాగర్‌లు సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపక బృందం సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించింది. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఏసన్న, ప్రధానో పాధ్యాయుడు రంగన్న పాల్గొన్నారు.
Updated Date - Jan 03 , 2024 | 11:06 PM