ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రబీ సాగు సందిగ్ధం

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:27 PM

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు వరప్ర దాయనిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నది.

ఎడమ కాలువ ద్వారా సాగుకు విడుదలవుతున్న నీరు (ఫైల్‌)

  • ఖరీఫ్‌ సీజన్‌లో 83వేల ఎకరాల్లో సాగు

  • యాసంగికి నీటి విడుదల ఉంటుందా..?

  • ఐఏబీ సమావేశం తర్వాత నీటి విడుదలపై స్పష్టత

  • జూరాల ఎడమ కాలువ ఆయకట్టుకు విడుదల చేయాలంటున్న రైతులు

ఆత్మకూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు వరప్ర దాయనిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తున్నది. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఆశించిన మేర వరద రాకపో వడంతో ఖరీఫ్‌ సీజన్‌కు మాత్రమే నీటి విడుదల చేసి రబీ సీజన్‌కు నీటి విడుదల చేయలేదు. దీని కారణంగా రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిం చారు. ఈ ఏడాది ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వచ్చి చేరింది. ప్రజా ప్రతి నిధుల ఆదేశాల మేరకు ప్రాజెక్టు అధికారులు జూలై మొదటి వారంలోనే కుడి, ఎడమ కాలు వలకు సకాలంలో నీటి విడుదల చేశారు. ఎడ మ కాలువ ఆయకట్టు పరిధి రైతులు 83 వేల ఎకరాలు, కుడి కాలువ ఆయకట్టు పరిధిలో 35 వేల ఎకరాల సాగు చేశారు. జూలై మొదటి వా రంలో నీటి విడుదల చేసిన కారణంగానే ముం దుగా నార్లు పోసుకున్న రైతులు అక్టోబరు చివరి వారం నుంచి నవంబరు చివరి వారం వరకు కోతలు పూర్తి చేశారు. మళ్లీ యాసంగి కోసం నార్లు పోసుకోవడా నికి సిద్ధమయ్యారు.

యాసంగికి నీరు విడుదల చేయాలి

గత ఏడాది వర్షాభావ పరిస్థితుల తో నీటి విడుదల చేయని కారణంగా రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. ఈ ఏడాది అత్యధికంగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో తొమ్మిది టీఎంసీలకు పైగా నీరు ఉంది. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి కూడా స్వల్పంగా రోజు వారీగా ఐదువేల క్యూసెక్కులు విడుదలవుతున్నది. దీంతో ఈ ఏడాది కూడా యాసంగికి సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రతీ ఏడాది యాసంగి పంటకు సాగునీటి విషయంపై ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధు లు, ప్రాజెక్టు అధికారులు, రైతు సంఘాల నా యకుల సమావేశం అనంతరమే సాగునీటి విడు దలపై స్పష్టత ఇచ్చే ఆనవాయితీ కొనసాగు తుం దని ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి గిట్టుబా టు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ప్రకటించడంతో రైతులు అత్యధికంగా వరి పంట సాగుకు మొగ్గుచూపుతున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 11:27 PM