పేదలకు వరం ‘పోషణ్ అభియాన్’
ABN, Publish Date - Sep 21 , 2024 | 11:25 PM
పేదలకు వరం పోషణ్ అభియాన్ అని, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలలో బలమైన పౌష్టికా హారం అందిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ అన్నారు.
-ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, సెప్టెంబరు 21: పేదలకు వరం పోషణ్ అభియాన్ అని, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలలో బలమైన పౌష్టికా హారం అందిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ అన్నారు. పోషణ్ అభియాన్ పోషణ మా సం కార్యక్రమంలో భాగంగా శనివారం పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ సీడీపీవో లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా సంక్షేమ అధికారి రా జేశ్వరి, ఆర్డీవో మాధవితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల కోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందజే స్తుందన్నారు. ఎసీడీసీవో కమల, పోషణ బియాన్ డీసీ విజ్ఞాన్, ప్రదీప్, సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మాపూర్‌లో..
వంగూరు: మండలంలోని ఉమ్మాపూర్‌లో శనివారం అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ అభి యాన్ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. పద్మ, ఎన్‌ఎం లక్ష్మీదేవ మ్మ, అంగన్‌వాడీ టీచర్ ఈశ్వరమ్మ, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 11:25 PM