పెండింగ్ బిల్లుల పంచాయితీ
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:00 PM
పంచాయతీల నిధులు రాక ప్రజాప్రతినిధులు పరేషాన్‌లో ఉన్నారు. దీనికితోడు రాజకీయ రంగప్రవేశం వారిని కుంగదీస్తోంది. అసలే పాలన గడువు ముగియనుండడంతో పెండింగ్ బిల్లుల పరిస్థితి ఏమిటన్నది మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.
- పులుముకుంటోన్న రాజకీయ రంగు
- గత ప్రభుత్వ వైఖరే కారణమంటోన్న అధికార పార్టీ
- 90శాతం బీఆర్‌ఎస్ మద్దతుదారులే ఉండడంతో దిక్కుతోచని స్థితి
- దాదాపు రెండేళ్లుగా విడుదల కాని రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు
- నాలుగు నెలలుగా 15వ ఆర్థిక సంఘం నిధులూ పెండింగ్‌లోనే
- రెండేళ్ల నుంచి క్లియర్‌కాని ఉపాధి పథకం పనుల బిల్లులు
- ప్రతీ పంచాయతీలో రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు పెండింగ్
- మరో పది రోజుల్లో ముగియనున్న పాలకవర్గాల గడువు
- బిల్లులపై ఆందోళనలో సర్పంచులు
పంచాయతీల నిధులు రాక ప్రజాప్రతినిధులు పరేషాన్‌లో ఉన్నారు. దీనికితోడు రాజకీయ రంగప్రవేశం వారిని కుంగదీస్తోంది. అసలే పాలన గడువు ముగియనుండడంతో పెండింగ్ బిల్లుల పరిస్థితి ఏమిటన్నది మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రస్తుత అధికార పార్టీ వారు గత ప్రభుత్వ వైఖరి వల్లే ఈ దుస్థితికి కారణమంటుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వారు మాత్రం పెండింగ్ బిల్లులు ఇచ్చేదాకా పోరాటం చేస్తామంటుండడం గమనార్హం. చిన్న పంచాయతీ మొదలుకొని పెద్ద పంచాయతీల్లో రూ.10 లక్షల నుంచి రూ. కోటి దాకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఒకపక్క పెండింగ్ బిల్లుల రాక.. మరోపక్క పాలన గడువు రోజుల వ్యవధిలో తీరిపోనుండటం.. ఇంకోపక్క రాజకీయం చోటుచేసుకుంటుండటంతో సర్పంచ్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
మహబూబ్‌నగర్, జనవరి 18 (ఆంరఽధజ్యోతి ప్రతినిధి): గ్రామపంచాయతీల పెండింగ్ బిల్లు లపై రాజకీయం రగులు తోంది. సర్పంచ్ సహా పాలకవర్గాల గడువు మరో పది రోజుల్లో ముగియనుం డడం, ఈలోపు పెండింగ్ బిల్లులు వచ్చే పరిస్థితి క నిపించకపోవడంతో సర్పంచు ల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దుస్థితికి గత ప్రభు త్వ వైఖరే కారణమని అధికార పార్టీ నేతలు ప్ర కటిస్తుంటే, బిల్లులివ్వకపోతే ఆందోళనలు చేస్తామని ప్రతిపక్ష బీ ఆర్‌ఎస్ పేర్కొనడం పెండింగ్ బి ల్లులపై జరగబోయే రాజకీయాన్ని సూచిస్తోంది. సర్పంచులలో 90 శాతం పైగా బీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉండడం తో, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బిల్లుల కోసం నిలదీయలేకపోయామని ఇప్పుడు సర్పంచులు లోలోన మథనపడుతున్న పరిస్థితి నెల కొంది. చిన్నపంచాయతీ మొదలుకొని పెద్ద పంచాయ తీల వరకు రూ.10లక్షల నుంచి రూ. కోటి వరకు బిల్లులు పెండింగ్ పడడం, దాదాపు రెండేళ్లుగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు జమకాకపోవడం, గత నాలుగు మాసాలుగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కిం ద చేపట్టిన పనులకూ బిల్లులు రాకపోవడం, మరోవైపు పాలక వర్గ గడువు ముగియనుండడంతో సర్పంచుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది.
రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు పెండింగ్ బిల్లులు
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని 821 గ్రామపంచాయతీల్లో దాదాపు అన్ని పంచాయతీల్లో పెద్ద ఎత్తున చేసిన పనులకు బిల్లులు పెం డింగ్‌లో ఉన్నాయి. సీసీరోడ్లు, వైకుంఠధామాలు, మట్టిరోడ్లు, డ్రైనేజీల పనులకు సంబంధించిన బిల్లులు దాదాపు రెండేళ్ల నుంచి రావడం లేదు. . ఎంబీ రికా ర్డులు సమర్పించిన వెంటనే బిల్లు మొత్తా నికి చెక్కులు మంజూరయినా, ట్రెజరీల్లో నిధుల్లేక, పంచాయతీల ఖాతాల్లోకి నిధులు జమకాకపోవడంతో సర్పంచులకు నిధులం దని పరిస్థితి నెలకొంది. చిన్నపంచాయతీ లు మొదలుకొని పెద్ద పంచాయతీల వ రకు కనిష్టంగా రూ.10లక్షల నుంచి గరిష్టం గా రూ.కోటి వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
నారాయణపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి..!
ఉట్కూరు మండలం చిన్నపొర్ల గ్రామంలో ఎంబీ రికార్డులు చేసినా బిల్లులు మంజూరు కాని నిధులు రూ.23లక్షలు, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి రూ.20లక్షలు కలిపి మొత్తం రూ.43లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సర్పంచ్ రవీందర్‌రెడ్డి వాపోయారు. వీటి ల్లో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు దాదాపు వచ్చాయని, రాష్ట్ర ఆర్థి కసంఘం కోటాలో రావాల్సిన రూ.25 లక్షల నిధులు ఈ ఏడాది కాలం గా ఇవ్వడం లేదని, దీంతో తమకు అవస్థ ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అప్పులు చేసి పనులు చేశామని, రెండేళ్లుగా పెండింగ్ బిల్లులు పేరుకపోవడంతో వడ్డీల భారం పెరిగి ఇబ్బందు లు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మక్తల్ మండలం పంచ్‌దేవ్‌పాడులో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.13లక్షలు పెం డింగ్‌లో ఉన్నాయని, ఇతర నిధుల ద్వారా చేపట్టిన డ్రైనేజీలు, శ్మశా నవాటిక, జీపీ మరమ్మతులు, ఉపాధి పథకం కింద చేపట్టిన పనుల కు సంబంధించి రూ.10లక్షలు కలిపి మొత్తం రూ.33లక్షల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, ఏడాదిన్నరగా బిల్లులురాక అవస్థలు పడుతు న్నామని సర్పంచ్ కల్పన వాపోయారు. మద్దూరు మండలం పల్లెర్లలో రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.10లక్షలతో సీసీరోడ్డు, హెల్త్‌సెంటర్ మర మ్మతులు, హైమాస్ట్ లైట్లకు రూ.రూ.3లక్షలు, ఇతర పనులు చేపట్టామని, బి ల్లులు రాకపోవడంతో ఏడాదిన్నరగా అవస్థ పడుతున్నామని వాపోయారు. నారాయణపేట రూరల్ మండలంలో ఉపాధి హామీ పథక ంకింద చేపట్టిన పనులతో పాటు, ఎస్‌ఎఫ్‌సీ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.30 లక్షలు పెండింగ్ బిల్లులున్నాయని సర్పంచ్ విజయలక్ష్మి తెలిపారు.
పెండింగ్ బిల్లుల తీరిది....!
మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చాకలిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ భవననిర్మాణానికి సంబంధించి రూ.25లక్షలు, సీసీరోడ్లకు సంబంధించి రూ.7లక్షలు, పంచాయతీ నిర్వహణకు రూ.3లక్షలు, అండర్‌గ్రౌండ్ డ్రేనేజీ పనుల నిమిత్తం రూ.5లక్షల నిధులు కలిపి మొత్తం రూ.30లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మరో పది రోజుల్లో గడువు ముగిస్తే తమ పరిస్థితి ఏమటో అర్థమవడం లేదని సర్పంచ్ రాములమ్మ వాపోయారు. రాజాపూర్ మండలం లోని మల్లేపల్లి గ్రామంలో సీసీరోడ్లకు సంబంధించి రూ.5లక్షలు, పంచాయతీ భవన మరమ్మతులకు రూ1.5 లక్షలు, మట్టిరోడ్డుకు రూ.3 లక్షలు, మన ఊరు-మన బడి కింద రూ.2లక్షలు కలిపి రూ.11.50 లక్షల పెండింగ్ బిల్లులు రావాలని సర్పంచ్ శ్యాంభాయి పేర్కొన్నారు. తమకు ఎంబీలు చేయగా, నిధుల్లేక ట్రెజరీలో ఆగిపోయాయని, ఏడాదిగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని తెలిపారు. బాలానగర్ మండలంలో ప్రతి పంచాయతీలో దాదాపు రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని, 15వ ఆర్థిక సంఘం, రాష్ట్రార్థిక సంఘం నిధులు రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్ పేర్కొన్నారు. అడ్డాకుల మండల కేంద్రంలో గ్రామీణ క్రీడా ప్రాంగణం కింద రూ.3.50 లక్షల నిధులు రావాల్సి ఉందని, పనులు చేసి దాదాపు 20 నెలలు కావస్తుందని, మన ఊరు- మన బడి కింద చేసిన పనులకు అప్పటి ఏఈ రూ.1లక్ష తక్కువ బిల్లు ఇచ్చారని, సాధారణ పనులకు సంబంధించి రూ.3లక్షలకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయని సర్పంచు మంజుల వాపోయారు. తమకు గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణానికి, ప్రహరీకి సంబంధించి రూ.35 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వడ్డీలకు తెచ్చి పనులు చేయించామని, బిల్లులు రాక ఏడాదిగా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని గండీడ్ మండలం కొంరెడ్డిపల్లి సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
రెండు జిల్లాల్లో రూ. 200 కోట్ల పైచిలుకు పెండింగ్ బిల్లులు
మహబూబ్‌నగర్, నారాయణపేట రెండు జిల్లాల్లో కలిపి పంచాయతీల్లో చేపట్టిన పనులకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి 22 నెలలకు పైగా నిధులు విడుదల కాలేదని చెబుతున్నారు. వీటితో పాటు ఎన్నికల కారణంగా నాలుగు నెలలుగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కూడా ట్రెజరీల్లో ఆగాయని పేర్కొంటున్నారు. వీటితో పాటు ఉపాధి హామీ పథకం కింద దాదాపుగా రెండేళ్ల నుంచి వివిధ పనులకు సంబంధించి అరకొర తప్ప నిధులివ్వలేదని, దీంతో మొత్తంగా రెండు జిల్లాలలో 821 పంచాయతీల్లో దాదాపు రూ.200 కోట్లపైచిలుకు నిధులు సర్పంచులకు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రతీ త్రైమాసికానికి బిల్లులు చెల్లిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని, అలా చేయకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని సర్పంచులు వాపోతున్నారు. మరో పది రోజుల్లో సర్పంచులు, మొత్తం పాలకవర్గాల గడువు ముగియనుండడంతో బిల్లుల కోసం ఏం చేయాలనే అంశంపై సర్పంచులు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి నెలకొంది.
Updated Date - Jan 18 , 2024 | 11:00 PM