ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓల్వో బస్సు బోల్తా ఒకరి మృతి

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:23 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండల కేంద్రం వద్ద గల 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఓల్వో బస్సు బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు

నలుగురికి గాయాలు

మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల వద్ద ఘటన

అడ్డాకుల, సెప్టెంబరు 21 : మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండల కేంద్రం వద్ద గల 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఓల్వో బస్సు బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పాండిచ్చేరి నుంచి శుక్రవారం సాయంత్రం 27 మంది ప్రయాణికులతో బీఎంసీసీ ట్రాన్స్‌ఫోర్ట్‌కు చెందిన ఓల్వో బస్సు హైదరాబాద్‌కు బయలు దేరింది. శనివారం ఉదయం స్నేహ చికెన్‌ ఫాంకు చెందిన కోళ్ల డీసీఎం వాహనం కొత్తకోట వైపు నుంచి అడ్డాకుల దగ్గర యూ టర్న్‌ తీసుకుంటుండగా గమనించని ఓల్వో బస్సు డ్రైవర్‌ అదుపు తప్పి వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టాడు. బస్సు ఫల్టీలు కొట్టి కింద పడిపోయింది. అదే సమయంలో కృష్ణయ్య (52), అంజనేయులు అనే ఇద్దరు గ్రామస్థులు బహిర్భూమికి వెళ్లి రోడ్డు పక్కన ఉండగా బస్సు నేరుగా కృష్ణయ్యపై పడింది. రోడ్డు రాపిడికి కృష్ణయ్య శరీరం మాంసపు ముద్దగా మారింది. బస్సులోని ప్రయాణికులు కుమార్‌, శ్యామ్‌కుమార్‌, కిరణ్‌, బస్సు డ్రైవర్‌ వెంకటేశ్‌లకు స్వల్ప గాయాలు కాగా ఎల్‌అండ్‌టీ, 108 అంబులెన్స్‌, పోలీస్‌ సిబ్బంది క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు క్రేన్‌ సహాయంతో బోల్తాపడిన బస్సును పక్కకుతీసి ట్రాఫిక్‌ను ని యంత్రించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉ న్నారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 21 , 2024 | 11:23 PM