ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చిన ఎన్టీఆర్‌

ABN, Publish Date - Jan 18 , 2024 | 10:51 PM

దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజిపేట రాములు అన్నారు.

గద్వాలలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

- టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజిపేట రాములు

- జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్‌ వర్ధంతి

- ఘన నివాళి అర్పించిన నాయకులు, అభిమానులు

- ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు

గద్వాల అర్బన్‌, జనవరి 18 : దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజిపేట రాములు అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం పట్టణం లోని పాత బస్టాండ్‌, చెనుగోనిపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత ఆయనకే దక్కింద న్నారు. ఇటు రాజకీయం, అటు చలనచిత్ర రంగాల్లో తెలు గు వారి ఘనతను చాటి చెప్పారన్నారు. నేటితరం నాయకులు, ప్రజలు ఆయన ఆశయాలను కొనసాగించా లన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రవి యాదవ్‌, ప్రధాన కార్యదర్శి నరసింహులు, సీనియర్‌ నాయకుడు ఇస్మాయిల్‌, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యదర్శి శివన్న, ప్రధాన కార్యదర్శి ఉప్పల పాటి నాగరాజు, గద్వాల మండల ఉపాధ్యక్షుడు వెంక టన్న, మల్దకల్‌ మండల అధ్యక్షుడు బంగి గోవిందు, వెంక టరమణ, భీమేష్‌, వెంకటన్న, రుద్రరాజు పాల్గొన్నారు.

తెలుగు ఖ్యాతిని చాటిచెప్పిన ఎన్టీఆర్‌

వడ్డేపల్లి : తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని, కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన మహనీయు డు, దివంగత ఎన్టీఆర్‌ అని టీడీపీ సీనియర్‌ నాయకుడు పూర్ణచంద్రారావు కీర్తించారు. ఎన్టీఆర్‌ 28వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని ఆయన విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణసూరి, నాయకులు వెంకటరామన్‌, రామ్మోహన్‌, వెంకటేశ్వర రావు, పేపర్‌ మహేష్‌, కిష్టన్న, గోపాలరావు, చాణిక్య, సాయిచరణ్‌ ఉన్నారు.

సంక్షేమ పథకాలకు ఎన్‌టీఆర్‌ ఆద్యుడు

అయిజ : ప్రజా సంక్షేమ పథకాలకు ప్రవేశపెట్టిన ఆద్యుడు ఎన్‌టీఆర్‌ అని టీడీపీ మండల ఆధ్యక్షుడు సుధాకర్‌గౌడ్‌ కొనియాడారు. ఎన్‌టీఆర్‌ వర్ధంతి సంద ర్భంగా గురువారం పట్టణంలోని ఎన్‌టీఆర్‌ సర్కిల్‌లో ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తూముకుంట ఈరన్నగౌడు, చాకలి నాగన్న, శ్రీధర్‌, కడ్లె శివరాజ్‌, కండక్టర్‌ వెంకటేష్‌, భీమన్న, వీరన్నగౌడు, కృష్ణరెడ్డి, వెంకట్‌నాయుడు, లాయర్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 10:51 PM

Advertising
Advertising