ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సామాజిక చైతన్యంతో సాహిత్యం సుసంపన్నం

ABN, Publish Date - Dec 01 , 2024 | 11:46 PM

కవులు రచయితల్లో సామాజి క అస్తిత్వ చైతన్యం ఉంటేనే వారు వెలువరిం చే సాహిత్యం సుసంపన్నమవుతుందని ప్రసి ద్ధ రచయిత, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అఽధ్యక్షుడు డాక్టర్‌ నాళేశ్వరం శంకరం అభిప్రాయపడ్డారు.

మాట్లాడుతున్న తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ నాళేశ్వరం శంకరం

- ప్రసిద్ధ రచయిత డాక్టర్‌ నాళేశ్వరం శంకరం

మహబూబ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కవులు రచయితల్లో సామాజి క అస్తిత్వ చైతన్యం ఉంటేనే వారు వెలువరిం చే సాహిత్యం సుసంపన్నమవుతుందని ప్రసి ద్ధ రచయిత, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అఽధ్యక్షుడు డాక్టర్‌ నాళేశ్వరం శంకరం అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాహితీ మ హబూబ్‌నగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆది వారం స్థానిక వాగ్దేవి జూనియర్‌ కళాశాలలో జరిగిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా తె లంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలలో ఆయ న ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాహిత్యం- సమాజం అనే అంశంపై సుదీ ర్ఘంగా ఉపన్యసించారు. సాహిత్యంలో పాట కు ప్రత్యేక స్థానం ఉందని, ఉద్యమకారుని పాట సమాజాన్ని చైతన్యవంతం చేసే సినీ పాటలు వినోదాన్ని మాత్రమే కలిగించి ప్రజ ల జేబులని గుల్ల చేస్తాయని అన్నారు. ప్ర స్తుతం దేశం కుంపట్లో మండుతోందని, సా హితీవేత్తలు తమ గుండె గొంతుకలో సమాజం కోసం కొట్లాడి వారిని మేల్కో ల్పాలని ఆయన సూచించారు. సాహితీ వేత్తలు కేవలం కవితల వరకే పరి మితం కాకుండా వివిధ సాహిత్య ప్రయత్నాల్లో విశ్లేషణాత్మక వివరణా త్మక అంశాలతో సాహి త్య సేద్యాన్ని సుసంప న్నం చేయాలని తెలం గాణ సాహితీ రాష్ట్ర అ ధ్యక్షుడు వల్లభాపురం జనార్దన, ఉపాధ్యక్షుడు అనంతోజు మోహన కృ ష్ణ తదితర వక్తలు సూచించారు. ప్రసిద్ద గజల్‌ వెంకటేశ్వర శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలం గాణ సాహితీ మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్ర ధాన కార్యదర్శి కొప్పోలు యాదయ్య, కార్యద ర్శి నివేదికను చదవగా, నాగర్‌కర్నూల్‌ జిల్లా నివేదికను డాక్టర్‌ భానుచందర్‌ చదివి విని పించారు. కవి సమ్మేళనానికి ప్రముఖ కవి కె.లక్ష్మణ్‌గౌడ్‌ అధ్యక్షత వహిం చగా, తెలంగా ణ సాహితీ నాగర్‌కర్నూల్‌ జి ల్లా ప్రధాన కా ర్యదర్శి అబ్దుల్‌ వహీద్‌ ఖాన్‌ నిర్వహించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 45 మంది కవులు వివిధ సామాజిక అంశాలపై తాము రచించిన కవిత్వాన్ని కవి సమ్మేళనం లో వినిపించి ఆహూతులను అలరించారు. తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు మైనొద్దీన్‌, కొప్పోలు యాదయ్య, కార్యదర్శులు కాళిదాసు, ప్రమోదుకుమార్‌, వనపర్తి జిల్లా తెలంగాణ సాహితీ కార్యదర్శి రాజారాం ప్రకాష్‌, ప్రముఖ విద్యావేత్తలు సురభి జగపతిరావు, భాస్కరయ్య, ప్రసిద్ధ కవులు పొద్దుటూరు ఎల్లారెడ్డి, వనపట్ల సుబ్బయ్య, వెన్నెల సత్యం, వైద్యం భాస్కర్‌తో పాటు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 11:46 PM