జూరాల ప్రాజెక్టు వరదతో.. నిలిచిన లాంచి ప్రయాణం
ABN, Publish Date - Oct 26 , 2024 | 11:19 PM
సోమశిల కృష్ణా నది మీదుగా శ్రీశైలం వర కు సాగే లాంచి ప్రయాణం వరద ఉధృతి పెరగడంతో శనివారం జరగలేదు.
- ప్రారంభానికి మరో వారం రోజుల సమయం
కొల్లాపూర్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : సోమశిల కృష్ణా నది మీదుగా శ్రీశైలం వర కు సాగే లాంచి ప్రయాణం వరద ఉధృతి పెరగడంతో శనివారం జరగలేదు. జూరాల ప్రాజెక్టులో 11 గేట్లు ఎత్తడంతో వరద ఉధృతి పెరిగింది. దీంతో తెలంగాణ టూరిజం శాఖ లాంచి ప్రయాణం నిలిపి వేసినట్లు జిల్లా టూరిజం శాఖ అధికారి కల్వరాల నర సింహ పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు తెరిచి కిందికి వరద నీటిని విడిచా రు. దీంతో లాంచి ప్రయాణం వారం రోజుల్లో ప్రారంభం కానుందని ఆయన తెలిపారు.
Updated Date - Oct 26 , 2024 | 11:19 PM