కోస్గికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు
ABN, Publish Date - Jan 24 , 2024 | 10:56 PM
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో రాష్ట్ర ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్లు బుధవారం కళాశాలను పరిశీలించారు.
కోస్గి రూరల్ జనవరి 24: నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో రాష్ట్ర ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్లు బుధవారం కళాశాలను పరిశీలించారు. జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు చంద్రమోహన్, ఉజ్వలరేఖ(కంప్యూటర్ సైన్స్), రజిని(ఈసీఈ హెడ్‌డిపార్ట్‌మెంట్) బృందం తనిఖీ చేసింది. కళాశాలలోని వసతులు, తరగతి గదులు, పరికరాలు, కంప్యూటర్ల గురించి ప్రిన్సిపాల్ పరమేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ విభాగంలో అడ్మిషన్లు తీసుకుంటామన్నారు. అందుకు అనుగుణంగా వసతులను పరిశీలిస్తున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, విజయ్‌కుమార్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్ పాల్గొన్నారు.
Updated Date - Jan 24 , 2024 | 10:56 PM