డేటా ఎంట్రీలో తప్పులు జరుగకుండా చూడాలి
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:11 PM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీలో త ప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న డేటా ఎంట్రీని పరిశీలిస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట టౌన్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీలో త ప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న డేటా ఎంట్రీని కలెక్టర్ పరిశీలించారు. డేటా ఎంట్రీని వేగవంతం చేయాలని సూచించారు. సర్వే వివరాలు బయటకు రానివ్వకుండా జాగ్రత్త వహించాలన్నారు. వివరాల నమోదు సమయంలో ఎన్యుమరేటర్లు అందుబాటులో ఉండాలని సూచించారు.
Updated Date - Nov 25 , 2024 | 11:11 PM