ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుల ఎన్నిక

ABN, Publish Date - Dec 04 , 2024 | 11:15 PM

యువజన కాంగ్రెస్‌ ఎన్నికల ఫ లితాలు వెలువడ్డాయి.

- ఎన్నికల ఫలితాల ఆధారంగా జిల్లాల కమిటీల నియామకం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): యువజన కాంగ్రెస్‌ ఎన్నికల ఫ లితాలు వెలువడ్డాయి. రెండు నెలల క్రితం అ న్ని జిల్లాల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు, జ నరల్‌ సెక్రెటరీలకు ఆన్‌లైన్‌లో ఎన్నికలు నిర్వ హించారు. ఎన్నికలు పూర్తై ఫలితాలు వెలువ డ్డాయి. వీటిని యూత్‌ కాంగ్రెస్‌ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని అధ్య క్షులుగా రెండోస్థానంలో ఉన్నవారిని ఉపాధ్య క్షులుగా నియమించారు. ఇలా ఉమ్మడి పాల మూరులోని ఐదు జిల్లాలకు సంబంధించిన అ ధ్యక్షుల నియామకాలు పూర్తయ్యాయి. వారికి వచ్చిన ఓట్ల ఫలితాలను కూడా వెల్లడించారు. కొన్ని చోట్ల ఇద్దరి మధ్య అధ్యక్ష స్థానానికి తీవ్ర పోటీ జరగగా, మరికొన్ని చోట్ల ముగ్గురు పోటీ పడ్డారు. మహబూబ్‌నగర్‌లో ఆరుగురు, వనప ర్తిలో తొమ్మిదిమంది, నారాయపేటలో ఐదుగు రు, నాగర్‌కర్నూల్‌లో ఎనిమిది మంది, గద్వాల లో ఐదురుగురు పోటీ పడ్డారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఉన్న ఆవేజ్‌ అ హ్మద్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. ఇక్కడ మొత్తం 24,772 ఓట్లు పోలవ గా అందులో అవేజ్‌ 9621 ఓట్లు సాధించి అ ధ్యక్షుడిగా ఎన్నికవగా, మహేశ్‌కుమార్‌ 6083 ఓట్లతో ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 12392 ఓట్లు పోలవగా అందులో కొత్తపల్లి వినోద్‌కుమార్‌కు అత్యధికంగా 6896 ఓట్లు రాగా ఆయన అధ్య క్షుడిగా నియమితులయ్యారు. 4690 ఓట్లతో రాజేశ్‌ ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

వనపర్తి జిల్లాలో 14136 ఓట్లు పోలవ గా ఆదిత్య 8212 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా ఎన్నికవగా, 4227 ఓట్లతో దివాకర్‌ ఉపాధ్యక్షు డిగా నియమితులయ్యారు.

జోగుళాంబ గద్వాట జిల్లాలో 13482 ఓ ట్లు పోల్‌ అవగా అందులో రంగన్నగారి తిరు మలేష్‌ 8941 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా ఎ న్నికవగా, 4406 ఓట్లతో చిట్టెం పురుషోత్తంరెడ్డి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

నారాయణపేటలో 9775 ఓట్లు పోలవ గా అందులో కొత్త మధుసూదన్‌రెడ్డి 5511 ఓ ట్లు సాధించి యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్య క్షుడిగా నియమితులు కాగా, 3841 ఓట్లతో మ నోజ్‌ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Updated Date - Dec 04 , 2024 | 11:15 PM