ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పట్టా ఇచ్చారు.. హద్దులు మరిచారు

ABN, Publish Date - Jan 29 , 2024 | 11:10 PM

గూడు లేని నిరుపేదలకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి మొదటి నుంచి ఇబ్బం దులే ఎదురవుతున్నాయి.

పస్పుల గ్రామంలో పాతిన హద్దు రాళ్లు

- 30 ఏళ్లుగా ఎదురు చేస్తున్న లబ్ధిదారులు

మరికల్‌, జనవరి 29 : గూడు లేని నిరుపేదలకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి మొదటి నుంచి ఇబ్బం దులే ఎదురవుతున్నాయి. మండలంలోని పస్పుల గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 ఏళ్ల నుంచి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇళ్ల పట్టాలను చేతిలో పెట్టిన అఽధికారులు హద్దులు చూపించకపోవడంతో సొంతింటి కల ఏళ్ల నుంచి నిరాశగానే మిగి లింది. గ్రామానికి మంజూరైన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు సైతం మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ఎంపిక చేసి దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ పునాది పడలేదు. పస్పుల గ్రామంలో 1992లో ఇళ్లు లేని 65 మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ సర్వే నెంబర్‌ 211లో మూడెకరాల 19 గుంటల భూమిలో ఒక్కొక్కరికీ 135 చదరపు గజాల చొప్పున పాట్లు చేసి, పట్టాలు అందజేశారు. కానీ ఇప్పటి వరకు అధికారులు హద్దులు చూపించకపోవ డంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధి కారులు స్పందించి తమకు కేటాయించిన స్థలంలో హద్దులు చూపించ డంతో పాటు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. అదే విధంగా పూసల్‌పహుడ్‌ గ్రామంలో సర్వే నెంబర్‌ 18లో ఎనిమిదెకరాల ప్రభుత్వ భూమిని డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు ఎంపిక చేసి, దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నా ఇక్కడ కూడా నిర్మాణాలకు నోచుకోలేదు.

Updated Date - Jan 29 , 2024 | 11:10 PM

Advertising
Advertising