ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాటేస్తున్న కాలుష్యం

ABN, Publish Date - Jan 04 , 2024 | 11:03 PM

ఎస్‌ఎన్‌ఎస్‌ ప్యాక్టరీ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు పలు గ్రామాలకు శాపంగా మారాయి. పరిశ్రమ వ్యర్థాలతో నీరు, గాలి కలుషితమవుతోంది. దుర్వాసనతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ, (ఇన్‌సెట్లో) శేకుపల్లి వాగు నుంచి పారుతున్న కలుషిత నీరు

- పరిశ్రమ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం

- దుర్వాసనతో 4 గ్రామాల ప్రజలు సతమతం

- ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

ఎర్రవల్లి, జనవరి 4 : ఎస్‌ఎన్‌ఎస్‌ ప్యాక్టరీ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు పలు గ్రామాలకు శాపంగా మారాయి. పరిశ్రమ వ్యర్థాలతో నీరు, గాలి కలుషితమవుతోంది. దుర్వాసనతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎర్రవల్లి మండల పరిధిలోని కొండేరు గ్రామ శివారులోని ఎస్‌ఎన్‌ఎస్‌ ప్యాక్టరీ 44వ నెంబర్‌ జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. 2012 సంవత్సరంలో ఏర్పాటైన ఈ పరిశ్రమ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలను సమీపంలో ఉండే నీటిలోకి యథేచ్చగా వదిలేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడే వ్యర్థ రసాయనిక జలాలను శుద్ధి చేసి బయ టకు వదలాల్సి ఉంటుంది. కానీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆ నీరు సమీపంలోని శేకుపల్లి వాగు ద్వారా కృష్ణానదిలోకి చేరుతోంది. ఆ నీటిని తాగిన మూగ జీవాలు మృత్యువాత పడ్డ సంఘటనలు ఉన్నాయి. అలాగే సమీపంలోని పంట పొలాలు కూడా నాశనమయ్యాయి. దీంతో పంటలు సరిగా పండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీపీ స్నేహ గతంలో జిల్లా పరిషత్‌ సమావేశంలో ఫిర్యాదు చేశారు. అయినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో కొండేరు, జింకలపల్లి, శేకుపల్లి, ఎర్రవల్లి గ్రామాల ప్రజలతో పాటు, జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తున్న వారు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి జల, వాయు, కాలుష్యానికి కారణమైన పరిశ్రమపై చర్యలు తీసుకొవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

పరిశ్రమపై ఫిర్యాదు అందింది

పరిశ్రమపై ప్రజల నుంచి ఫిర్యాదు అందిందని కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పరిశ్రమ యాజమాన్యానికి విషయం తెలిపామని, వారికి కొంత సమయం ఇచ్చామని, వారు స్పందించక పొతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే తన పేరు, హోదా, ఇతర వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.

పరిశ్రమపై చర్యలు తీసుకోవాలి

ఈరన్న, సర్పంచ్‌, కొండేరు : పరిశ్రమ నుంచి వస్తున్న దుర్వాసనను భరించలేకపోతున్నాం. పరిశ్రమ నుంచి వస్తున్న దుర్వాసనను నియంత్రించాలని గ్రామస్థులతో కలిసి పరిశ్రమ యాజమాన్యానికి విన్నవించినా వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పరిశ్రమ వద్ద ఆందోళన చేపడతాం.

బతుకుదెరువు ఆగమైంది

చాకలి బీచుపల్లి, రైతు, కొండేరు : ప్యాక్టరీ పక్కనే నాకు వ్యవసాయ భూమి ఉంది. అందులో పంటలు సాగు చేసుకునేవాడిని. పరిశ్రమ ఏర్పాటు చేయక ముందు పంటలు పండేవి. ఫ్యాక్టరీ వచ్చాక భూమి దెబ్బతిని పండటం లేదు. ఈ విషయంపై ఫ్యాక్టరీ యజమానులను అడిగితే కౌలు ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వకపోవడంతో బతుకుదెరువు లేకుండా పోయింది. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jan 04 , 2024 | 11:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising