ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విధిగా ఓటు హక్కు వినియోగం

ABN, Publish Date - Apr 02 , 2024 | 10:57 PM

రాజ్యాంగం పౌరులం దరికీ సమానంగా అందించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌ అన్నారు.

ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు, సిబ్బంది, విద్యార్థులు

- అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌

- ‘ఐ ఓట్‌ ఫర్‌ షూర్‌’ నినాదంతో 5-కే రన్‌

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 2 : రాజ్యాంగం పౌరులం దరికీ సమానంగా అందించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌ అన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమో దు చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశం మేరకు ‘స్వీప్‌’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలో ‘ఐ ఓట్‌ ఫర్‌ షూర్‌’ నినాదంతో 5-కే రన్‌ నిర్వహించారు. కృష్ణవేణి చౌరస్తా వద్ద అదనపు కలెక్టర్‌ రన్‌ను ప్రారంభిం చారు. అక్కడి నుంచి పాత బస్టాండ్‌ సర్కిల్‌కు చేరిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన సమా వేశంలో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. అభివృద్ధి, ప్రగతి ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు ఓటు హక్కును ఆయుధంగా మలుచుకోవాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలన్నారు. కళాశాలల విద్యార్థులు ఈ నెల 15 వరకు ఫారం-6 ద్వారా తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కోరారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడంతో పాటు, విద్యా సంస్థల్లో ఓటుహక్కుపై అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ మే మూడవ తేదీలోగా ఓటు హక్కు నమోదుక దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు, బీఎల్‌వోలు, మునిసిపల్‌ సిబ్బందితో కలిసి ఓటు హక్కు వినియోగించుకుం టామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గద్వాల ఆర్డీవో రామచందర్‌, స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారి ఎంపీ రమేశ్‌బాబు, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ కమిషనర్‌ శంకర్‌ సింగ్‌, డీఆర్‌డీవో నరసింగరావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద నాయక్‌, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్వేత ప్రియదర్శిని, డీవైఎస్‌వో బీఎస్‌ ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 10:57 PM

Advertising
Advertising