ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాలల సంరక్షణ అందరి బాధ్యత

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:04 AM

బాలల సంరక్షణ అందరి బాధ్యతని, వారి సంరక్షణకు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌ అన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌

- చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌

గద్వాల న్యూటౌన్‌, మార్చి 28 : బాలల సంరక్షణ అందరి బాధ్యతని, వారి సంరక్షణకు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాల యాల సముదాయంలో గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌, ప్రిన్సిపల్‌ మెజిస్ట్రేట్‌, జువనైల్‌ న్యాయా ధికారి ఉదయ్‌నాయక్‌ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం యూనిసెఫ్‌ సీనియర్‌ ప్రోగ్రాం అధికారి డేవిడ్‌రాజ్‌ మాట్లాడుతూ పిల్లల సంరక్షణకు సంబంధిత అధికారుల సహకారంతో ముందుకు వెళ్లాలని, అందుకు చట్టాలపై అవగాహన అవసరమని తెలిపారు. పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారు; ఎవరితో చాటింగ్‌ చేస్తున్నారనే విషయాలను ఎప్పటికప్పుడు గమనిం చాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రస్తుతం చిన్నారు లు వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోక్సో చట్టం 2012 చాలా కఠినమైనదని, దీనిపై అందరికీ అవగాహన ఉండాలని సూచించారు. అనంతరం బాలల సంరక్షణ చట్టాలను వివరించారు. సమావేశానికి జిల్లా సంక్షేమాధికారి సుధారాణి, సీడబ్ల్యూసీ చైర్మన్‌ సహదేవుడు, జడ్పీ సీఈవో కాంత మ్మ, బీసీ, ఎస్పీ వెల్ఫేర్‌ అధికారి శ్వేతా ప్రియదర్శిని, డీసీపీవో నరసింహ, సీడీపీవోలు హేమలత, కమలాదేవి, సుజాత, పోలీస్‌ అధికారులు హాజరయ్యారు.

Updated Date - Mar 29 , 2024 | 12:04 AM

Advertising
Advertising