పల్లె దవాఖానాలో మెరుగైన సేవలు
ABN, Publish Date - Sep 21 , 2024 | 10:58 PM
గ్రామాల్లోని పల్లె దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
- పల్లె దవాఖానా, ప్రాథమిక పాఠశాల తనిఖీ
ఊట్కూర్, సెప్టెంబరు 21 : గ్రామాల్లోని పల్లె దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని కొల్లూర్ పల్లె దవాఖాన, ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పల్లె దవాఖా నాలో ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీతో పాటు మౌలిక వసతులు ఎలా ఉన్నాయని అడిగారు. ఈ సందర్భంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద, వైద్య రంగానికి అధిక ప్రా ధాన్యం ఇస్తుందన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్ర మత్తంగా ఉండాలన్నారు. అంతకుముందు పాఠశాలలో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టారు. గణితంపై విద్యార్థులు ప ట్టు సాధించాలన్నారు. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల కొరతను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తా అన్నారు. కాంగ్రెస్ నాయకులు సంవృద్ధి, గోవిందురాజు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 10:58 PM