అట్టహాసంగా దసరా ఉత్సవాలు
ABN, Publish Date - Oct 13 , 2024 | 11:51 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం మినీ ట్యాంక్‌బండ్‌పై శనివారం బతుకమ్మ, దసరా ఉత్సవాలను అట్టహాసం గా నిర్వహించారు. ట్యాంక్‌బండ్ పొడువునా రంగు రం గుల విద్యుత్ దీపాలతో అలంకరించి భారీ బాణసం చాలు, డీజేలు, ఎల్‌ఈడీ లైట్ల మిరిమిట్లతో పట్టణ ప్రజల కోలాహాలం నడుమ వేడుకలు వైభవంగా జరి గాయి.
- శమీ వృక్షానికి పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి
- పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను తిలకించిన పట్టణ ప్రజలు
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 13: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం మినీ ట్యాంక్‌బండ్‌పై శనివారం బతుకమ్మ, దసరా ఉత్సవాలను అట్టహాసం గా నిర్వహించారు. ట్యాంక్‌బండ్ పొడువునా రంగు రం గుల విద్యుత్ దీపాలతో అలంకరించి భారీ బాణసం చాలు, డీజేలు, ఎల్‌ఈడీ లైట్ల మిరిమిట్లతో పట్టణ ప్రజల కోలాహాలం నడుమ వేడుకలు వైభవంగా జరి గాయి. కళకళలాడుతున్న బతుకమ్మలు, దసరా ఉత్స వాల వైభవం సందర్శకులను కట్టిపడేశాయి. బుద్ద ఘా ట్ వద్ద శమీ వృక్షానికి స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, సరిత దంపతులు పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం లవ్ ఎన్‌జీకేఎల్ వద్ద ఎమ్మెల్యే బాణా సంచాను చేతబూని కాల్చి యువతను ఉత్సాహ పరిచా రు. బతుకమ్మ ఘాట్ వద్ద ఎమ్మెల్యే దంపతులు మహి ళలతో కలిసి సద్దుల బతుకమ్మ ఆడి చెరువులో నిమ జ్జనం చేశారు. తదనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద ఎమ్మెల్యే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను ఏకం చేచే బతుకమ్మ మన సంస్కృతి, సాం ప్రదాయాలను ముఖ్యమైన భావన అన్నారు. సాంస్కృ తిక కార్యక్రమాల్లో కళాకారులు, యువత నృత్యాలు, పా టలు ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు ప్రత్యేకించి యువత, మహి ళలు, పిల్లలు హాజరై వేడకలను మరింత ఆనందంగా మార్చారు. మినీ ట్యాంక్‌బండ్ దసరా ఉత్సవాల వద్ద పట్టణ ముస్లింలు హిందూ సోదరులను గులాబి పువ్వు లు అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ట్యాంక్‌బండ్ వద్ద సందర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎండబెట్ల, ఐతోల్, సిర్సవాడ వైపు వెళ్లే వాహనాలను పోలీసులు మంతటి గేట్ మీదుగా ట్రాఫిక్ దారి మళ్లించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్థానిక సీఐ కనకయ్య, ఎస్‌ఐ గోవర్దన్ పర్యవేక్షణలో గట్టి బందోబస్తు నిర్వహించి వేడుకలను ప్రశాంతంగా ముగించారు. కౌన్సిలర్లు కావలి శ్రీనివాసులు, నిజాముద్దీన్, తీగల సునేంద్ర, జక్కా రాజవర్దన్‌రెడ్డి, బాదం సునీత నరేందర్, పద్మమ్మ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.హబీబ్, గౌస్, సలీం, గంగా లక్ష్మణ్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 13 , 2024 | 11:51 PM