ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బోసిపోయిన వంతెన

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:04 PM

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గుడెబల్లూరు గ్రామ శివారులో 167వ నెంబర్‌ జాతీయ రహదారిలో కృష్ణానదిపై ఉన్న బస్సు వంతెనను మరమ్మతు దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం మూసివేసింది.

బస్సు వంతెనపై కాలినడకన ప్రయాణికులు

- కాలినడకన వెళ్తున్న ప్రయాణికులు

కృష్ణ, జనవరి 18 : నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని గుడెబల్లూరు గ్రామ శివారులో 167వ నెంబర్‌ జాతీయ రహదారిలో కృష్ణానదిపై ఉన్న బస్సు వంతెనను మరమ్మతు దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం మూసివేసింది. దీంతో నిత్యం హైదరాబాద్‌ నుంచి రాయచూరు, తమిళనాడు, కేరళ, గోవా వివిధ రాష్ర్టాలకు కర్ణాటక మీదుగా వెళ్లే వాహనాలతో రద్దీగా ఉండే బస్సు వంతెన వాహనాల దారి మళ్లింపుతో గురువారం బోసి పోయింది. దీంతో చిరు వ్యాపారులు, హోటల్‌, దాబాలు, పెట్రోల్‌ బంకులో విక్రయాలు నిలిచిపోయాయని స్థానిక వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల నుంచి నిత్యావసర వ స్తువుల కొనుగోలు చేయడానికి, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కంపెనీకి వెళ్లే కార్మికులు, కూరగాయలు అమ్మే వారు, పాడి రైతులు బస్సు వంతెనపై కాలిన డక ద్వారా దేవసూగూరుకు వెళ్లి వస్తున్నారు. ఇతర గ్రామాలకు వెళ్లి వస్తున్న ప్రయా ణికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దేవసూగూరులో బస్సు దిగి కాలినడకన చెక్‌పోస్టుకు చేరుకొని అక్కడి నుంచి ఇతర వాహనాల ద్వారా గమ్యస్థానాలకు వెళ్తు న్నారు. ఇప్పటికైనా పనులు వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:04 PM

Advertising
Advertising