సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
ABN, Publish Date - Oct 08 , 2024 | 11:22 PM
వడ్డేపల్లి మండల పరిధిలోని తనగల గ్రామానికి చెందిన నాగేంద్రప్పకు మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.60 వేలు మంజూరయ్యాయి.
వడ్డేపల్లి, అక్టోబరు 8 : వడ్డేపల్లి మండల పరిధిలోని తనగల గ్రామానికి చెందిన నాగేంద్రప్పకు మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.60 వేలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కును అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం బాధిత కుటుంబ సభ్యుడికి అందించారు. కార్యక్రమంలో నాగేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, భీమేష్, వీరన్న పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
వడ్డేపల్లి మండలం తిమ్మాజిపల్లె గ్రామానికి చెందిన జ్ఞానవంతుడు, జమ్మన్న కర్నూలు జిల్లా కొంతలపాడు గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మంగళవారం తిమ్మాజిపల్లె గ్రామానికి వెళ్లి మృతదేహాలకు పూలమాలల వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
Updated Date - Oct 08 , 2024 | 11:22 PM