ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భూకబ్జాదారులు 3 నెలల్లో జైలుకే

ABN, Publish Date - Jan 18 , 2024 | 05:06 AM

భూ కబ్జాలు చేసిన వారిని రెండు మూడు నెలల్లో జైలుకు పంపుతామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టీకరణ

నల్లగొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భూ కబ్జాలు చేసిన వారిని రెండు మూడు నెలల్లో జైలుకు పంపుతామని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడ పెద్దచెరువు ఆక్రమణపై ‘కూల్‌గా కబ్జా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి‘ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘కూల్‌గా కబ్జా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని చూపించి, అభినందించారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడ పెద్దచెరువు ప్రభుత్వ భూముల్లో కొండలను తవ్వి విల్లాలకు రోడ్డు నిర్మిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు ఆపించాలని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌కు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రంలోగా నిర్మాణాలు ఆపి అది ప్రభుత్వ స్థలమని సూచించే బోర్డు, ప్రహరీ ఏర్పాటు చేయిస్తామన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన కీలక మంత్రి బావమరిది ప్రభుత్వ భూమిని పట్టపగలు కబ్జా చేశారని, పదేళ్లుగా గత ప్రభుత్వంలో లక్షల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. ‘ధరణి’ పేరిట కబ్జా చేసి దోచుకున్న వారి వివరాలు త్వరలో బయటపెడతామని, భూకబ్జా చేసినవారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కబ్జాకు గురైన భూములు కాపాడేలా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోపే చర్యలు తీసుకుంటామన్నారు. 120 మాసాలు అధికారంలో ఉండి నెల రోజులకే కొంపమునిగినట్టు మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వెయ్యి కోట్ల విలువైన 400 ఎకరాల కాందిశీకుల భూమిని గత మంత్రి, ఎమ్మెల్యేలు కబ్జా చేయకుండా అడ్డుకున్నానని తెలిపారు.

Updated Date - Jan 18 , 2024 | 05:06 AM

Advertising
Advertising