కూలీల ఆటో బోల్తా
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:29 AM
పనులకు వెళ్లి తిరిగి వస్తు న్న కూలీల ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్ర మాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందగా 14 మం దికి గాయాలయ్యాయి.
కూలీల ఆటో బోల్తా
మహిళ మృతి
14 మందికి గాయాలు
డిండి, జనవరి 28: పనులకు వెళ్లి తిరిగి వస్తు న్న కూలీల ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్ర మాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందగా 14 మం దికి గాయాలయ్యాయి. డిండి ఎస్‌ఐ సైదులు తెలిపి న వివరాల ప్రకారం.... మండలంలోని ఎర్రారం గ్రా మానికి చెందిన వ్యక్తి ఆటోలో కె.గౌరారం, జాల్‌తం డా గ్రామాలకు చెందిన 15 మంది కూలీలు ఆదివా రం మిరపకాయలు ఏరేందుకు ఉదయం శాంతిగూ డెం గ్రామానికి ఆటోలో వెళ్లారు. పని ముగించుకొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. దేవరకొండ - డిండి ప్రధాన రహదారిపై ఉన్న తంబాలబండ వ ద్ద ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జాల్‌తండాకు చెందిన రాత్లావత ముత్యాలి (40) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో లో ప్రయాణిస్తున్న 14 మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సామర్థ్యానికి మించి ఆటో లో కూలీలు ప్రయాణించడం వల్లే ఆటో అదుపు త ప్పి పల్టీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదు లు తెలిపారు. ముత్యాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలు ముత్యాలికి భర్త దూత్యా, ఇ ద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 12:29 AM