కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN, Publish Date - Sep 27 , 2024 | 11:55 PM
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
వికారాబాద్, సెప్టెంబరు27 : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్ర పటానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్ధానిక సంస్థలు) సుధీర్‌తో కలిసి ఆయన జ్యోతి ప్రజల్వన చేశారు. అనంతరం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్య పాత్ర పోషించారని, వారి సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తనకంటూ ఏమి లేకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తన ఆస్తులు మొత్తం దానం చేసిన త్యాగశీలి అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారుల సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలను అధికారికంగా జరపడం సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమములో బీసీ సంక్షేమ అధికారి ఉపేందర్ , డీపీఆర్‌వో చెన్నమ్మ, కౌన్సిలర్ దత్తు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 27 , 2024 | 11:55 PM