పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి
ABN, Publish Date - Jan 20 , 2024 | 12:18 AM
పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, తాను కలిసి పనిచేస్తామని ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్‌రావు అన్నారు.
కాల్వశ్రీరాంపూర్, జనవరి 19: పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, తాను కలిసి పనిచేస్తామని ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.6.82లక్షలతో నిర్మించిన డైనింగ్ గది, అనంతరం ఆరెపల్లి గ్రామంలో రూ.20లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెప ల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో భానుప్రసాద్ రావు మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయం ఉంటుం దని, ఎన్నికల తరువాత గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా చిన్న గ్రామాలు ఏర్పాటు చేసి సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించారన్నారు. ప్రభుత్వాలు మారినా వారి ప్రణాళికలు మారుతుంటాయి తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం పెద్దప ల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు ఎలాంటి వ్యాపారాలు లేవని, ఎప్పుడు ప్రజల్లో ఉండే విజయరమణారావుతో కలిసి తాను అభివృద్ధికి సహకరిస్తానన్నారు. ఈ మండలంలో ఎస్ ఆర్‌ఎస్‌పీ టేలెండ్ ప్రాంతాలకు సాగునీరు అందించడంతో పాటు సాగునీరు అందించేందుకు తన సహాయసహకా రాలు ఎళ్లవేళలా ఉంటాయన్నారు. తన తల్లి కాల్వశ్రీరాంపూ ర్‌లో గతంలో హాస్టల్‌లో ఉండి చదువుకుందని, అందుకే ఈ మండలం తనకెంతో ఇష్టమని, మండల అభివృద్ధికి సహా యసహకారాలు అందిస్తానన్నారు. ఆరెపల్లి గ్రామానికి స ర్పంచ్ దేవేందర్‌రావు ఎన్నో నిధులు తీసుకురావడం జరిగిం దని, తన వంతు కూడా నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. మరో రూ.5లక్షలు ఎమ్మెల్సీ నిధుల నుంచి ఆరెపల్లికి ఇవ్వ నున్నట్టు తెలిపారు. కాగా, గ్రామానికి అంగన్‌వాడీ సెంటర్, రేషన్ డీలర్‌షిప్, ఆరేపల్లి, మల్లయ్యపల్లెకు రూ.20లక్షలతో సీసీ రోడ్లు, కమ్యూనిటీహాల్, రూ.5లక్షలతో జీపీ ప్రహారి, పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావును సర్పంచ్ దేవేందర్‌రావు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ రోడ్డు కు రూ.10లక్షలు, మహిళా భవనాన్ని రెండు నెలలోపు మం జూరుచేస్తానని, మిగతా పనులు దశల వారీగా మంజూరు చేస్తానని, వాటర్‌ప్లాంట్ స్వయంగా నిర్మించిఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామాలకు సాగునీరు అందించడంతో పాటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కటింగ్ లేకుండా చూస్తామ న్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణరావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావులకు సర్పంచ్‌తో పాటు గ్రామస్థులు సన్మా నించారు. ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్‌పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, సర్పంచ్‌లుఎ పొన్నం దేవేందర్‌గౌడ్, ఆరెల్లి సుజాతరమేష్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 20 , 2024 | 12:18 AM