అర్హులందరికీ రైతు భరోసా వర్తింపచేస్తాం
ABN, Publish Date - Oct 26 , 2024 | 12:37 AM
రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసాను కచ్చితంగా అందించి తీరుతామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు.
పాలకుర్తి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసాను కచ్చితంగా అందించి తీరుతామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. శుక్రవారం మండ లం పరిధిలోని జయ్యారం, పుట్నూర్ గ్రామాల్లో మేడిపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పలు పథకాలకు రూపకల్పన చేసి అమలుచేస్తోందన్నారు. రైతులకు ప్రయోజనం కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి క్వింటాలుకు 2,320 రూపాయల మద్దతు ధరను చెల్లిస్తున్నామన్నారు. రైతులు దుమ్ము,ధూళి లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. గత ప్రభుత్వం గుట్టలు, పుట్టలు, సాగుకు నోచుకోని భూములకు సైతం రైతు బంధు చెల్లించి రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సహకార సంఘం చైర్మన్ మామిడాల ప్రభాకర్, సీవో వైద్య రమేష్, మాజీ ఎంపీపీ గంగాధరి రమేష్ గౌడ్, కన్నా ల పీఏసీఎస్ చైర్మన్ బయ్యపు మనోహర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎంపీడివో పొల్సాని శశికళ, తహసీల్దార్ ఎం జ్యోతి, మండల వ్యవసాయ శాఖ అధికారి బండి ప్రమోద్ కుమార్, మాజీ సర్పంచ్‌లు మల్లెత్తుల శ్రీనివాస్, పర్శవేణి శ్రీనివాస్ యాదవ్, నాయ కులు నార సత్తయ్య, కొప్పు ప్రసాద్, మేడం బాపు తదితరులతో పాటు పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 26 , 2024 | 12:38 AM