ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:41 PM
రైతులు వ్యవసాయంలో ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక దిగుబడులు, లాభాలు సాధించాలని కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ అన్నారు.
అంతర్గాం, జనవరి 18: రైతులు వ్యవసాయంలో ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక దిగుబడులు, లాభాలు సాధించాలని కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం అంతర్గాం మండ లంలోని పెద్దంపేటలో పురుగుల మందుల పిచికారి, విత్తనాలు చల్లే పరికరం డ్రోన్‌ను ప్రారంభించి కలెక్టర్ ఈ మేరకు మాట్లాడారు. కూలీల కొరత నేపథ్యంలో రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టి సారించాలని పేర్కొన్నారు. డ్రోన్ పరికరంతో ఖర్చు, సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. డ్రోన్ పరి కరాన్ని తైవాన్ నుంచి కొనుగోలు చేసిన రాయదండి గ్రామానికి చెందిన యువ రైతులు పల్లె శ్యామ్, రాజుల ను కలెక్టర్ అభినందించారు. 20లీటర్ల కెపాసిటీ ట్యాంక్ గల డ్రోన్‌తో 15నిమిషాల్లో ఎకరం పొలంలో మందును పిచికారీ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధి కారి ఆదిరెడ్డి, తహసీల్దార్ రాంమోహన్‌రావు, ఎంపీడీఓ యాదగిరి, వ్యవసాయ అధికారి రాంబాబు, సర్పంచ్‌లు మేరుగు భాగ్యమ్మగురు వయ్యగౌడ్, ధర్మాజీ కృష్ణ, ఎంపీటీసీ కొలిపాక శరణ్యమధుకర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:41 PM