ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కూలిపోయిన వంతెనను పునర్నిర్మించాలి

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:13 AM

రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని జనగా మలో రెండేళ్ల క్రితం గోదావరి వరదలతో కూలిపోయిన వంతెనను పునః నిర్మాణం చేపట్టాలని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు సింగరేణి యా జమాన్యాన్ని డిమాండ్‌ చేశారు.

కళ్యాణ్‌నగర్‌, జనవరి 17: రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని జనగా మలో రెండేళ్ల క్రితం గోదావరి వరదలతో కూలిపోయిన వంతెనను పునః నిర్మాణం చేపట్టాలని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు సింగరేణి యా జమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం కూలిపోయిన వంతెనను సీపీఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా కూలిపోయిన వంతెనను అప్పటి ఎమ్మెల్యే చందర్‌, ఎంపీ వెంకటేష్‌నేత సందర్శించి వంతెన పునర్నిర్మాణం చేపడుతామని చెప్పి ఏడాది అయినా ఇప్పటివరకు హామీని నెరవేర్చలేదన్నారు. వంతెన కు నిధులు మంజూరు చేసినప్పటికీ ఎందుకు నిర్మాణం చేపట్టడం లేదని వారు మున్సిపల్‌, సింగరేణి అధికారులను ప్రశ్నించారు. పొలాలకు వెళ్లే రైతులు, స్మశానానికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే వంతెనను నిర్మించేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయ కులు తొడుపునూరి రమేష్‌, తాళ్లపల్లి మల్లయ్య, గుంపుల కుమారస్వామి, జైపాల్‌రెడ్డి, కల్వల జగన్‌ ఉన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:13 AM

Advertising
Advertising