ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మళ్లీ రోడ్డెక్కిన బూడిద లారీలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:56 AM

మళ్లీ ఓవర్‌లోడ్‌తో బూడిద లారీలు రోడ్డెక్కాయి. ఓవర్‌లోడ్‌తో బూడిద తరలింపుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నెలరోజులపాటు రవాణా నిలిచిపోగా, తాజాగా వారం రోజుల క్రితం నుంచి మళ్లీ బూడిదను తరలించడం ప్రారంభించారు. అధికారుల కళ్లు గప్పి రాత్రిపూట యథేచ్ఛగా ఓవర్‌లోడ్‌తో బూడిదను తరలిస్తున్నారు. మార్గమధ్యలో లారీల నుంచి తెప్పలుతెప్పలుగా రాలుతున్న బూడిద రహదారిపై వెళుతున్న వాహనదారుల కళ్లల్లో పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అధికారులు పట్టుకున్న ఓవర్‌లోడ్‌ బూడిద వాహనాలు

- ఓవర్‌లోడ్‌తో రాత్రి వేళల్లో రవాణా

- ఒక్కో లారీలో 50 నుంచి 60 టన్నుల బూడిద తరలింపు

- రోడ్డుపై పడుతున్న బూడిదతో వాహనదారుల ఇక్కట్లు

- 21 లారీలను పట్టుకున్న ఆర్‌టీఏ అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మళ్లీ ఓవర్‌లోడ్‌తో బూడిద లారీలు రోడ్డెక్కాయి. ఓవర్‌లోడ్‌తో బూడిద తరలింపుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నెలరోజులపాటు రవాణా నిలిచిపోగా, తాజాగా వారం రోజుల క్రితం నుంచి మళ్లీ బూడిదను తరలించడం ప్రారంభించారు. అధికారుల కళ్లు గప్పి రాత్రిపూట యథేచ్ఛగా ఓవర్‌లోడ్‌తో బూడిదను తరలిస్తున్నారు. మార్గమధ్యలో లారీల నుంచి తెప్పలుతెప్పలుగా రాలుతున్న బూడిద రహదారిపై వెళుతున్న వాహనదారుల కళ్లల్లో పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీలో బొగ్గు ఆధారితంగా విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది. బొగ్గు కాల్చడం వల్ల వెలువడే బూడిద కోసం కుందనపల్లి వద్ద 500 ఎకరాల్లో యాష్‌ పాండ్‌ను నిర్మించారు. దీంట్లో పెద్ద ఎత్తున బూడిద నిల్వలు ఉన్నాయి. ఈ పాండ్‌ నుంచి సింగరేణికి ఉచితంగా బూడిదను తరలించుకుపోతున్నారు. భూగర్ఘ గనుల్లో బొగ్గును వెలికితీసిన తర్వాత వాటిని బూడిదతో నింపుతున్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో పెద్దఎత్తున బూడిదను వాడుతున్నారు. సింగరేణి, జాతీయ రహదారులకు బాటమ్‌ యాష్‌ను వినియోగిస్తున్నారు. 2028 నాటికి యాష్‌ పాండ్‌లో బూడిదను అంతా ఖాళీ చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే(జాతీయ రహదారులు)ల నిర్మాణంలో బాటమ్‌ యాష్‌ను వాడాలని నిర్ధేశించింది. ఆ మేరకు ఎక్కడైతే జాతీయ రహదారులను నిర్మిస్తున్నారో, దానికి సమీపంలోని పవర్‌ ప్లాంట్‌ల నుంచి ఉచితంగా బాటమ్‌ యాష్‌ను తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేల నిర్మాణాల కోసం జిల్లాలోని కుందనపల్లిలోగల ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌ నుంచి గత ఐదు మాసాల నుంచి బూడిదను తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి దాదాపు 200 నుంచి 250 కిలోమీటర్ల దూరం వరకు పెద్ద పెద్ద లారీల్లో బూడిదను తరలిస్తున్నారు. ఒక్కో లారీలో నిబంధనలకు విరుద్ధంగా 50 నుంచి 60 టన్నుల వరకు బూడిదను తరలిస్తున్నారు. రవాణా చార్జీల భారాన్ని తగ్గించుకునేందుకు లారీల వాహనాల బాడీని మరింత ఎత్తుకు పెంచి వాటి సామర్థ్యానికి మించి ఒక్కో లారీలో 20 నుంచి 30 టన్నుల బూడిదను అదనంగా తీసుకవెళుతున్నారు.

వారం రోజుల నుంచి..

కుందనపల్లి యాష్‌ పాండ్‌ నుంచి బసంత్‌నగర్‌, పెద్దపల్లి కరీంనగర్‌ బైపాస్‌ హుజూరాబాద్‌, వరంగల్‌ మీదుగా ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు బూడిదతో లారీలు వెళుతున్నాయి. రెండు మాసాల క్రితం హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బూడిద లారీలను హుజూరాబాద్‌ సమీపంలో నిలిపివేశారు. ఎన్టీపీసీ బూడిదను నేషనల్‌ హైవే కోసం బూడిదను ఉచితంగానే ఇస్తున్నప్పటికీ, కాంట్రాక్టర్లు మాత్రం ఓవర్‌ లోడ్‌తో తరలిస్తున్నారు. మూడు వాహనాల్లో తరలించే బూడిదను రెండు వాహనాల్లోనే తరలిస్తున్నారు. దీంతో రోడ్లపై తీవ్ర భారం పడుతున్నది. స్పీడ్‌ బ్రేకర్లు, బొందలు, రోడ్లు దెబ్బతిన్న చోట్ల బూడిద వాహనాల్లోంచి తెప్పలుతెప్పలుగా పడుతున్నది. దీంతో ఆ బూడిద అంత గాలికి లేచి ద్విచక్క వాహనాలు, ఆటోలు, ఇతర లారీలు, వ్యాన్లు, బస్సుడ్రైవర్ల కళ్లలో పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడక్కడా చిన్నచిన్న ప్రమాదాలు కూడా జరిగాయి. దీంతో ఓవర్‌లోడ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధికారులు వాటిపై కొరఢా ఝుళిపించారు. దీంతో నెలరోజుల పాటు రవాణా నిలిచిపోయింది. వారం రోజుల క్రితం నుంచి మళ్లీ ప్రారంభించారు. రాత్రివేళలో ఓవర్‌ లోడ్‌తో బూడిదను తరలిస్తున్నారు. ప్రతి రోజు యాష్‌ పాండ్‌ నుంచి 100 నుంచి 150 బూడిద లారీలు వెళుతున్నట్లు సమాచారం. అప్పన్నపేట ఫ్లైఓవర్‌ సమీపంలో లారీల డ్రైవర్లు పక్కన నిలపడం వల్ల రోడ్‌ సైడ్‌ బర్ములు గుంతలుపడ్డాయి. వాహనాలను నిలిపిన చోట కూడా రోడ్డుపై బూడిద పడుతున్నది. ఓవర్‌లోడ్‌ రవాణాపై ఫిర్యాదులు రావడంతో రెండు రోజుల నుంచి రవాణా శాఖాధికారులు నిఘా పెట్టారు. గడిచిన రెండు రోజుల్లో రాత్రి వేళలో ఓవర్‌లోడ్‌తో వెళుతున్న 21 వాహనాలను ఆర్‌టీవో రంగారావు పట్టుకుని కార్యాలయానికి తరలించి ఓవర్‌లోడ్‌పై కేసులు నమోదు చేశారు. ఓవర్‌లోడ్‌తో వెళ్లే ఏ వాహనాన్నైనా సీజ్‌ చేస్తామని, ఓవర్‌లోడ్‌ను సహించేది లేదని రంగారావు హెచ్చరించారు.

Updated Date - Sep 21 , 2024 | 12:56 AM