గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జీఎం సమీక్ష
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:42 PM
గణతంత్ర దినోత్సవ నిర్వహణపై ఆర్జీ-2 జీఎం సూర్యనారాయణ గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
యైుటింక్లయిన్‌కాలనీ, జనవరి 18: గణతంత్ర దినోత్సవ నిర్వహణపై ఆర్జీ-2 జీఎం సూర్యనారాయణ గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు విభాగాల వారిగా కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించారు. డివిజన్‌లోని ప్రతి కార్మిక కుటుంబం గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల ని జీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్వోటూ జీఎం అబ్దుల్ సలీం, డీజీఎం పర్సనల్ రాజేంద్రప్రసాద్, డీజీఎం సివిల్ ధనుంజయ, ఎస్‌ఎస్ వో షరీఫ్ మహమ్మద్, రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవరావుతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:42 PM