వైభవంగా వేంకటేశ్వరస్వామి రథోత్సవం
ABN, Publish Date - Mar 26 , 2024 | 12:30 AM
సైదాపూర్ మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మి సమేత వెంటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగవైభవంగా జరిగింది.
సైదాపూర్, మార్చి 25: సైదాపూర్ మండలంలోని ఎక్లాస్‌పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మి సమేత వెంటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోత్సరణల మద్య స్వామి వారిని రథంపై ప్రతిష్టించి, భక్తులు తాడుతో రథం లాగగా గ్రామంలో స్వామి వారిని ఊరేగించారు. అనంతరం లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి వారిని గుడికి తీసుకెళ్లారు. అనంతరం పూర్ణాహుతి హోమం నిర్వహించి దేవతలకు చక్ర స్నానం చేయించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు కొత్త తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు గుండేటి శ్రీనివాస్, సీఈవో మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, గ్రామస్తులు వెంకటేశం, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రామడుగు : మండలంలోని గోపాల్‌రావుపేట గ్రామంలో జరుగుతున్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతీదేవికి పట్టువస్ర్తాలు, పుస్తేమట్టెలు అందజేశారు. ఈ నెల 27న జరుగబోయే కళ్యాణానికి పట్టు వస్త్రాలను అర్చకులకు అందజేశారు. ఆ సంఘం అధ్యక్షులు కొలిపాక మల్లయ్య, యూత్ అధ్యక్షులు అలవాల విష్ణు, నాయకులు సిరిపురం సత్యనారాయణ, మద్రేశం, మల్లేశం, కమలాకర్, లక్ష్మీనాయణ, ఆలయ కమటి చైర్మన్ నార్ల రమేశ్, సభ్యులు దోనపాటి సీతారాంరెడ్డి, బుచ్చిరాములు, మల్లేశం, రామస్వామి, రాజిరెడ్డి ఉన్నారు.
గంగాధర: మండలంలోని గర్షకుర్తి వెంకటేశ్వర స్వామి, ఉప్పరమల్యాల తుమ్మెదలగుట్ట లక్ష్మినర్సింహాస్వామి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గర్షకుర్తి వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా సోమవారం హవనం, బలిహరణం,బండ్లు తిరుగుట, శేషవాహనంపై డోలోత్సవాన్ని నిర్వహించారు. రెండు గ్రామాల్లో జరిగిన ఉత్సవాలకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై పూజలు చేశారు. ఆయన వెంట జడ్పిటీసీ పుల్కం అనురాధనర్సయ్య, పురమల్లమనోహార్, జాగిరపు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 26 , 2024 | 12:30 AM