ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేతన్నల బతుకులతో ఆడుకోవద్దు

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:41 AM

నేతన్నల బతుకులతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకోవద్దని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్‌ చేశారు.

సిరిసిల్లలో నేతన్న విగ్రహం ఎదుట మాట్లాడుతున్న నాయకులు

సిరిసిల్ల రూరల్‌, మార్చి 27 : నేతన్నల బతుకులతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకోవద్దని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్‌ చేశారు. సిరిసిల్లలో నెలకొన్న వస్త్ర పరిశ్రమ సంక్షోభం, కార్మి కులకు ఉపాధిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బుధ వారం సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోడం రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమగా పేరుగాంచిన సిరిసిల్లలో ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయిందని, వేలాది మంది కార్మికులకు ఉపాధిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం కార్మికులు అప్పులు చేసే దుస్థితికి వచ్చిందన్నారు. నేతన్నలకు చేయుత అందించి బతుకులను బాగు చేయాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకుండా కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతు న్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయాలను పక్కన బెట్టాలని, సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే సిరిసిల్లలో నేతన్నలకు ఉపాధిని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానం నుంచి ర్యాలీ చేపట్టారు.

నేడు వంటావార్పు

సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని చేనేత జౌళీశాఖ కార్యాలయం ఎదుట నేతన్నలతో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిని కల్పించాలంటూ గురువారం వంటావార్పు చేపట్టనున్నట్లు రమణ తెలిపారు. నాయకులు సిరిమల్లే సత్యం, ఉడుత రవి, ఓగ్గు గణేష్‌, సదానందం, భాస్కర్‌, క్రిష్ణ, ఇస్తారి, రాజు, సురేష్‌, తిరుపతి, శంకర్‌, శ్రీనివాస్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:45 AM

Advertising
Advertising