ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దిగుబడిపై దిగాలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:54 AM

ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పంట వేసింది మొదలు చేతికొచ్చేవరకు కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో దిగుబడిపై వరి, పత్తి రైతులు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో వానాకాలం సాగులో మొదట్లో రైతులు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తరువాత వరుసగా కురుస్తున్న వర్షాలు ఆవేదనకు గురి చేస్తున్నాయి.

- అధిక వర్షాలతో పంట నష్టం 49.37 ఎకరాలు

- 33 శాతం లెక్కతో అంచనా

- చివరి దశకు వానాకాలం సాగు

- తెగుళ్లతో రైతుల్లో ఆందోళన

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పంట వేసింది మొదలు చేతికొచ్చేవరకు కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో దిగుబడిపై వరి, పత్తి రైతులు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో వానాకాలం సాగులో మొదట్లో రైతులు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తరువాత వరుసగా కురుస్తున్న వర్షాలు ఆవేదనకు గురి చేస్తున్నాయి. తుఫాను ప్రభావంతో జిల్లాలో వరి పత్తి, పంటలు దెబ్బతిన్నాయి. నిబంధనల ప్రకారం 33 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం కింద నివేదికలు ఇస్తారు. వ్యవసాయ అధికారులు ఆగస్టు, సెప్టెంబరులో తుఫాను ప్రభావంతో వారం రోజులపాటు కురిసిన వర్షాలకు సంబంధించిన పంట నష్టాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భారీ వరదలకు చెరువులు, కుంటలు మత్తడి దూకడం, వాగులు పొంగిపొర్లడంతో వరి, పత్తి చేన్లలోకి నీళ్లు చేరాయి. మొదట్లో ప్రాథమిక అంచనా వేసిన అధికారులు పూర్తి స్థాయిలో రైతు పేరు, దెబ్బతిన్న పంట పేరు వంటి వివరాల నివేదికలను ప్రభుత్వానికి పంపించారు. నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్న పొలాల్లోని నీళ్లు పోయిన తర్వాత సర్వే చేసి నివేదికలు తయారు చేయడంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు మాత్రం ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 6 వరకు జరిగిన పంట నష్టంలో 119 మంది రైతులకు సంబంధించి 49.37 ఎకరాలు నష్టపోయినట్లు నివేదికలు అందించారు. ఇందులో వరి 111 మంది రైతులు 46.07 ఎకరాలు, పత్తి పంట 8 మంది రైతులు 3.30 ఎకరాలుగా అంచనా వేశారు. ప్రధానంగా వరి పంట ఎక్కువగా దెబ్బతిన్నట్లు నివేదికలు అందించారు. వరిలో చందుర్తి మండలంలో 9 మంది రైతులు 1.35 ఎకరాలు, రుద్రంగి 20 మంది రైతులు 8.20 ఎకరాలు, కోనరావుపేట 32 మంది రైతులు 9.24 ఎకరాలు, గంభీరావుపేట ఒక రైతు ఎకరం, వీర్నపల్లిలో 36 మంది రైతులు 18.30 ఎకరాలు, ముస్తాబాద్‌లో 9 మంది రైతులు 3.37 ఎకరాలు, తంగళ్లపల్లిలో నలుగురు రైతులకు సంబంధించి 2.21 ఎకరాలు నష్టపోయినట్లుగా నివేదించారు. పత్తి పంటలో రుద్రంగిలో ఏడుగురు రైతులు 3.20 ఎకరాలు, వీర్నపల్లిలో ఒక రైతుకు సంబంధించి 10 గుంటలు నష్టం జరిగినట్లు లెక్కలు వేశారు. ప్రధానంగా పరిహారం అంచనాలు వేసినా అధిక వర్షాలతో వరి, పత్తి పంటలకు తెగుళ్లు సోకి దిగుబడి తగ్గే పరిస్థితులు ఉండడంతో రైతులు అందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే పత్తి పంట ఎర్రబారి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందనుంది.

ఫసల్‌ బీమా ఎప్పుడో?

జిల్లాలో వరి, పత్తి ప్రధాన పంటలుగా ఉండగా తరువాత మొక్కజొన్న, పెసర, కందులు, ఇతర పంటలు వేస్తున్నారు. ఏటా అకాల, వడగళ్ల వర్షాలు తుఫాను ప్రభావంతో జిల్లాలో రైతులు నష్టపోతూనే ఉన్నారు. రైతులకు బీమా సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వం అందించే పరిహారంపైనే ఆధారపడి ఉంటున్నారు. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన పంట నష్టానికి జిల్లాలో 1036 మంది రైతులకు 1014 ఎకరాలకు సంబంధించి రూ.1,01,41,500 పరిహారాన్ని అందించారు. అందులో తంగళ్లపల్లి మండలంలో 348 మంది రైతులకు రూ. 35,46,750, గంభీరావుపేట 70 మంది రైతులకు రూ. 4,38,250, ముస్తాబాద్‌ 578 మంది రైతులు రూ .5514500, వీర్నపల్లిలో 40 మంది రైతులకు రూ 6,42,000పరిహారాన్ని అందించారు. పంట నష్టాల పరిహారం అందించే దిశగా ప్రభుత్వం మరోసారి ఫసల్‌బీమా యోజన పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించారు. గతంలో ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన పథకం అందించినా గత ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం మళ్లీ బీమా ప్రత్యేకతను గుర్తించిన ప్రభుత్వం పునరుద్ధరించడానికి నిర్ణయించ డంతో రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఫసల్‌మీమాను కాంగ్రెస్‌ ప్రభుత్వం యాసంగి పంట నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫసల్‌బీమా యోజనలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని నష్టాన్ని అంచనా వేసేవారు. ప్రస్తుతం జరుగుతున్న మార్పులతో యూనిట్‌గా అంచనా వేయలేకపోతున్నారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకున్న లెక్కించడం కష్టంగా మారే వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తామని చెబుతున్న క్రమంలో ఫసల్‌బీమా ఎప్పుడు వస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు.

వానాకాలం సాగు 2.32 లక్షల ఎకరాలు

జిల్లాలో వానాకాలం సాగులో 2.32 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేసుకున్నారు. ప్రధానంగా వరి 1.80 లక్షల ఎకరాలు, పత్తి 49,332 సాగు చేశారు. పెసర 56.26 ఎకరాలు, కందులు 939 ఎకరాలు, ఇతర పంటలు 122 ఎకరాల్లో వేశారు. జిల్లాలో వానాకాలం సాగులో గంభీరావుపేట మండలంలో 19,036 ఎకరాలు, ఇల్లంతకుంట 37,209, ముస్తాబాద్‌ 23,060, సిరిసిల్ల 5352, తంగళ్లపల్లి 20,405, వీర్నపల్లి 7314, ఎల్లారెడ్డిపేట 20,881, బోయినపల్లి 20,044, చందుర్తి 21,346, కోనరావుపేట 22,535, రుద్రంగి 9342 ఎకరాలు, వేములవాడ 10,366, వేములవాడ రూరల్‌లో 15,150 ఎకరాల్లో సాగు చేశారు.

Updated Date - Sep 21 , 2024 | 12:54 AM