ఎన్టీపీసీలో ‘జెమ్’ వర్క్‌షాప్ ప్రారంభం
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:07 AM
ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ ఆధ్వ ర్యంలో 5 రోజులపాటు నిర్వహిస్తున్న బాలికా సాధికా రత మిషన్(జెమ్) వర్క్‌షాప్ బుధవారం ప్రారంభ మైంది.
జ్యోతినగర్, జనవరి 17 : ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ ఆధ్వ ర్యంలో 5 రోజులపాటు నిర్వహిస్తున్న బాలికా సాధికా రత మిషన్(జెమ్) వర్క్‌షాప్ బుధవారం ప్రారంభ మైంది. ఐదు రోజులపాటు కొనసాగే ఈ వర్క్‌షాప్‌ను ఎన్టీపీసీ ఎజిఎం(హెచ్‌ఆర్ ఇన్‌చార్జి) విజయ్‌కుమార్ సిక్దర్ ప్రారంభించారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతంలో ని మూడు మండలాలకు చెందిన 54మంది విద్యార్థిను లు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నారు. ఈ శిక్షణా శిబి రంలో విద్యార్థినులకు చదువుకు సంబంధించిన అంశా లతోపాటు నైపుణ్యాభివృద్ధి, కళలు, నృత్యం, చిత్రలేఖ నం, క్రీడలు తదితర విషయాల్లో ప్రత్యేక శిక్షణనిస్తారు. బాలికల్లో సాధికారత సాధించడమే లక్ష్యంగా ప్రతి ఏటా వేసవి కాలంలో నెల రోజులపాటు జెమ్ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అయితే జనవరిలోనే జెమ్‌కు సంబంధించి 5 రోజుల వర్క్‌షాప్‌ను ముంద స్తుగా నిర్వహిస్తున్నారు. వర్క్‌షాప్‌లో పాల్గొనే విద్యార్థినులకు ఉచి త వసతి, భోజనం, ఇతర ఉపకరణాలను ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ ఆధ్వ ర్యంలో అందిస్తున్నారు. మొదటి రోజు శిబిరంలో పాల్గొంటున్న ఒక బాలిక పుట్టిన రోజును ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులు జరుపుకున్నారు. బాలికలను ప్రోత్సహించడం, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు జెమ్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తు న్నామని ఏజీఎం సిక్దర్ అన్నారు. ఎన్టీపీసీ కల్పిస్తున్న ఈ శిక్షణా శిబిరాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీజీఎం శామ్యూల్ ప్రశాంత్, దీప్తి మహిళా సమితి సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 12:07 AM