ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి తేలిన అభ్యర్థులు

ABN, Publish Date - Mar 30 , 2024 | 12:30 AM

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానా నికి పోటీ చేసే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయిం ది.

జగిత్యాల, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానా నికి పోటీ చేసే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయిం ది. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ బరిలో నిలుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం, ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్‌ ఊపు మీదుండగా బీజేపీ మోదీ చరిష్మా, అ యోధ్య రామమందిరం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమా లను నమ్ముకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మద్యే ఉం డనుంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌లో ముగ్గురూ ఉద్దండులే బరిలోది గ డంతో త్రిముఖ పోరులో గెలుపోటములపై ప్రజల్లో చర్చ మొదలైంది.

ముగ్గురూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులే...

నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఒక ప్రత్యేకత ఉంది. వీరు ముగ్గురు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరు సెగ్మెంట్‌ల నుంచి పోటీ చేసి ఓడిపో యిన అభ్యర్థులు కావడం విశేషం. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అ భ్య ర్థిపై ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎంపీ ధర్మ పురి అర్వింద్‌ కోరుట్ల సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌ రూ రల్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్థుతం ఈ ముగ్గురూ పా ర్లమెంట్‌ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు.

ఊపు మీదున్న కాంగ్రెస్‌...

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ఊపు మీద ఉంది. అదే ఊపుతో ఎలాగైనా పా ర్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఉవ్విల్లూరుతోంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలిగియున్న కాంగ్రెస్‌ మిగితా నియోజకవర్గాల్లోనూ మెజార్టీ ఓట్లు సాధిం చడంపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న ఆరు గ్యారెం టీలపైన ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఆరు గ్యా రెంటీల పథకం పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి దోహదపడు తాయని ఆశిస్తోంది. జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి అధిక ఓట్లు రాబట్టుకునే అవకాశాలున్నాయని బావిస్తోంది. కోరుట్ల, బోధన్‌ నియోజకవర్గాలలో గల నిజాం దక్కన్‌ షుగర్‌ లిమిటెడ్‌ కర్మాగారాల పునరుద్ధరణ అంశం తమకు కలిసి వస్తోందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది.

మోదీ చరిష్మా....రామ భక్తిని నమ్ముకున్న బీజేపీ

ప్రస్తుతం వీస్తున్న ప్రధాని మోదీ గాలి, చరిష్మా, అయోధ్య రామ మం దిర నిర్మాణ అంశాలు తమకు పార్లమెంట్‌ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశా లుగా బీజేపీ బావిస్తోంది. దేశ హ్యాట్రిక్‌ ప్రధానీగా నరేంద్ర మోదీకి అవకా శం ఇవ్వాలని మెజార్టీ ఓటర్లు అనుకుంటున్నారని బీజేపీ నమ్ముతోంది. ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రధానిచే భారీ బహిరంగ సభ నిర్వ హించి బీజేపీ ప్రచారంపై దృష్టి సారించింది. దీనికి తోడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం సైతం బీజేపీకి కలిసి వస్తోందని అనుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సైతం బీజేపీని గట్టెక్కిస్తుందనుకుంటున్నారు. పసుపు బోర్డు, ఎన్‌డీఎస్‌ఎల్‌ వ్యవహారం బీజేపీకి అనుకూలిస్తుందని అనుకుంటున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎమ్మెల్యేలను కలిగి యుండడా నికి తోడు ఇతర నియోజకవర్గాల్లోనూ బలమైన క్యాడర్‌ ఉందని విజయం నల్లేరుపై నడకలా మారుతోందని బీజేపీ అంచనా వేస్తోంది. సిట్టింగ్‌ నిజామాబాద్‌ స్థానంలో మరోమారు కషాయ జెండా ఎగురవేయడం ఖాయమన్న ధీమాతో బీజేపీ ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధాలను ప్రజల్లోకి తీసుకవెళ్లి ఎండగట్టడంతో పాటు ఓటు రాబట్టుకోవడంపై బీఆర్‌ఎస్‌ ప్రధానంగా దృష్టి సారించింది. దీనికి తోడు నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెం ట్‌లలో మూడు సెగ్మెంట్‌లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిత్యం వహిస్తుం డడం కలిసి వస్తోందని బావిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో అత్యధికంగా ఓట్లు సాధించుకున్న ఊ పుతోనే పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం విజయం సాధించాలని ఉవ్విల్లూరు తోంది. నిజామాబాద్‌ జిల్లాలో తమ అభ్యర్థికి బలమైన అనుచరగణం ఉం డడం, జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యేలను కలిగియుండడం కలిసి వచ్చే అం శాలుగా బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది.

పోటీ రసవత్తరం...

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థు లు ముగ్గురూ ఉద్దండులే కావడంతో పోటీ రసవత్తరంగా తయారైంది. బీ ఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తాటిపర్తి జీవన్‌ రెడ్డి మంత్రిగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిగియుం డడంతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ 2019లో రాజకీయ అరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బీసీ సామా జిక వర్గానికి చెందిన మున్నూరు కాపు కులానికి చెందిన వారు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి ఓసీ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి కులానికి చెందిన వారు. ఇద్దరు బీసీ అభ్యర్థులతో జీవన్‌రెడ్డి తలపడుతున్నారు.

Updated Date - Mar 30 , 2024 | 12:31 AM

Advertising
Advertising