ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN, Publish Date - Oct 25 , 2024 | 12:30 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు.

పాలకుర్తి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవ లు అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల ను తనిఖీ చేశారు. పుట్నూర్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, పాథమిక ఆరోగ్య కేంద్రం, కుక్కలగూడూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, జయ్యారం జడ్పీ పాఠశా లను కలెక్టర్‌ తనిఖీ చేశారు. పాఠశాలల్లో పిల్లలకు అం దించే మధ్యాహ్నం భోజనం, అంగన్‌వాడీ కేంద్రాల్లో అం దించే ఫౌష్టికాహరం నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పుట్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలు, వివరాలను కలెక్టర్‌ తెలుసుకున్నారు. ఔట్‌పేషంట్‌ సేవలను కచ్చి తంగా అమలుచేయాలని, ఓపీ సమయాల్లో వైద్యులు పూర్తి సమయం అందుబాటులో ఉండాలన్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్‌సీడీ సర్వే వివరాలను ఆరాతీశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న హెల్త్‌ క్యాంప్‌ను తనిఖీ చేసి పేషెంట్‌లకు అందుతున్న వైద్య సేవలను అడిగి తగిన మందులు ఇవ్వాలని ఆదేశించారు. కాగా పుట్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యం అందించాలని కోరుతూ గ్రామ యువకులు వైద్య నరేష్‌, తోట ప్రశాంత్‌, అంజి తదితరులు ఇటీవల కలెక్ట ర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. స్పందించిన కలె క్టర్‌ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్య లు తీసుకుంటానని గతంలో ఇచ్చిన మాట ప్రకారం గురువారం పుట్నూర్‌ పీహెచ్‌సీ సందర్శించిన కలెక్టర్‌కు వారు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.

Updated Date - Oct 25 , 2024 | 12:30 AM