ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగిత్యాలపై మత్తు పడగ

ABN, Publish Date - Mar 27 , 2024 | 12:42 AM

జిల్లాలోని ఓ పట్టణంలోని ఓ టాకీస్‌ ఏరియాలో నివాసముంటున్న 7వ తరగతి ఓ విద్యార్థి ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. గంజా యి వ్యసనానికి లోనైనా ఇతని నడవడిక సరిగా లేదని సదరు పాఠశాల నిర్వాహకులు టీసీ ఇచ్చి పంపించారు.

జగిత్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ఓ పట్టణంలోని ఓ టాకీస్‌ ఏరియాలో నివాసముంటున్న 7వ తరగతి ఓ విద్యార్థి ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. గంజా యి వ్యసనానికి లోనైనా ఇతని నడవడిక సరిగా లేదని సదరు పాఠశాల నిర్వాహకులు టీసీ ఇచ్చి పంపించారు. తల్లిదండ్రులను, కొట్టడం, డబ్బుల కోసం వేధించడం వంటివి చేశాడు. దీంతో తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. శిశు సంరక్షణ అధికారులు ట్రీట్‌మెంట్‌ ఇప్పించే సమయం లో సైతం సదరు అధికారులపై దాడికి పాల్పడ్డాడు. గత యేడాదిగా చికిత్స అందిస్తూ ప్రస్తుతం ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి పరీక్ష రాయించడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు.

ఫ జిల్లాలోని ఓ పట్టణంలోని ఓ విద్యార్థి 9వ తరగతిలో మత్తు మం దుకు అలవాటు పడ్డాడు. ఉపాధి నిమిత్తం తండ్రి దుబాయికి వెళ్లాడు. పా ఠశాలలకు సరిగా వెళ్లకపోవడం, అమ్మను తిట్టడం, చనిపోతానంటూ బెది రించడం వంటివి చేశాడు. దీంతో దుబాయిలో పనిచేస్తున్న తండ్రి అర్ధాం తరంగా స్వగ్రామానికి వచ్చాడు. అయినప్పటికీ బైక్‌ కొనివ్వాలని, మొబైల్‌ కొనివ్వాలని పట్టుబట్టాడు. ప్రస్తుతం సదరు విద్యార్థికి ఓపెన్‌ టెన్త్‌ రాయిం చడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు.

ఫ జిల్లాలోని ఓ పట్టణంలో ఓ మెస్‌ నడిపిస్తున్న మహిళ తాను సం పాదించిన డబ్బులు ఇంట్లో పెట్టుకోగా తరుచూ దొంగతనానికి గురికావ డంతో ఆందోళనకు గురైంది. పనిచేస్తే గానీ పొట్ట గడవని కుటుంబ పరి స్థితిలో ఉంది. 9వ తరగతి చదువుతున్న కొడుకు డబ్బులు దొంగిలిస్తున్నా డని, సదరు డబ్బులతో మత్తు పదార్థాలు కొనుగోలు చేసి వ్యసనదారునిగా తయారు అయ్యాడని గమనించి షాక్‌కు గురైంది.

ఫ జిల్లాలోని ఓ పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాలుగా పనిచేస్తున్న ఇద్దరు తల్లిదండ్రులకు చెందిన ఓ కుమార్తె 9వ తరగతి చదువుతోంది. సదరు వి ద్యార్థినికి ఇద్దరు సీనియర్‌ విద్యార్థులు పరిచయం అయ్యారు. వారి సహా యంతో మత్తు పదార్థాలు అలవాటు చేసుకోవడంతో పాటు సోషల్‌ మీడి యాలో వీడియోలు పోస్టు చేయడం వంటివి చేస్తోంది. విషయాన్ని గమ నించిన తల్లిదండ్రులు కుమార్తెపై ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వెళ్లకుం డా ఇంట్లోనే ఉంచారు. అయినా కూడా సదరు విద్యారిని ఆత్మహత్య చేసు కుంటానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తోంది.

ఫ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ ఇద్దరురు అన్నదమ్ములు గంజాయికి అలవాటు పడ్డారు. చిన్ననాడే తండ్రి మృతి చెందడంతో తల్లి పెంచి పోషిస్తోంది. 8వ తరగతి చదువుతున్న సదరు విద్యార్థులు గం జాయి కొనుగోలు చేయడానికి తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామంలో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడటం గ్రామస్థులు గమనించారు. చోరీ చేసిన వాటిని విక్రయించడం వల్ల వచ్చిన డబ్బులతో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు ప్రచారం ఉంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి.

ఓ వైపు దిచక్ర వాహనాలు, ఇతర వాహనాల్లో భారీగా తరలివస్తున్న గంజాయి...మరో వైపు పెద్ద ఎత్తున రవాణా అవుతున్న ప్యాకెట్లు, చాక్లెట్ల రూపంలో వస్తున్న గంజాయి...ఇంకో వైపు వందల సంఖ్యలో బయట పడుతున్న మత్తు ఇంజక్షన్లు...ఇవి చాలవన్నట్లుగా ఊహించని రీతిలో వి శాఖ, సీలేరు ప్రాంతం నుంచి దిగుమతి అవుతూ పట్టుబడ్డ గంజాయి.. ఇటీవల ఒక్కసారిగా జిల్లాలో కలకలం రేపాయి..! ప్రశాంతంగా ఉన్న జి ల్లాను మాదక ద్రవ్యాల ముఠాలు తమ అక్రమాలకు అనువైన స్థావరంగా భావిస్తున్నాయి. పోలీసులు, డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు, ఎక్సయిజ్‌ పోలీ సులు రోజు రోజుకూ నిఘాను తీవ్ర తరం చేస్తున్నప్పటికీ కేవలం సమా చారం ఉన్నంత వరకే వీటిని స్వాధీనం చేసుకోగలుగుతున్నారు. సమాచా రం అందని సరుకు మార్కెట్‌లో యథేచ్చగా చలామణి అవుతోంది. గంజా యి, డ్రగ్స్‌లకు ప్రధానంగా యువత, నిరుపేద విద్యార్థులు, బాలురు, బాలి కలను టార్గెట్‌గా చేస్తూ అక్రమ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫ లితంగా ఇతర చిన్నా, పెద్ద నేరాల్లోనూ మత్తు వ్యసనదారులు భాగస్వా మ్యం అవుతున్నారని భావిస్తున్నారు.

జిల్లాలో నమోదైన గంజాయి కేసులు...

జిల్లాలో 2021 సంవత్సరంలో 14 గంజాయి కేసులు నమోదు కాగా 38 మందిని పోలీసులు అరెస్టు చేసి సుమారు 30 కిలోల గంజాయిని పట్టుకు న్నారు. 2022లో 11 గంజాయి కేసులు నమోదు కాగా 32 మందిని అరెస్టు చేసి సుమారు 18.42 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 2023లో 13 గంజా యి కేసులు నమోదు కాగా 36 మందిని పోలీసులు అరెస్టు చేసి సుమారు 91.54 కిలోల గంజాయిని పట్టుకున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం రాయికల్‌, మల్లాపూర్‌ మండలాల్లో విశాఖ నుంచి తెచ్చి విక్రయానికి తీసుక వెళ్తున్న 10 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనలో పోలీసులకు పట్టుబడ్డ వారిలో చదువు మానేసిన విద్యార్థులు, యువకులు ఉండడం గమనార్హం. మరొక ఘటనలో గంజాయి వ్యసనానికి గురైన ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు ట్రాప్‌ చేయడం, మరో ఇద్దరు యువకులు సైతం అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వెలుగుచూడడం కలకలం రేపింది.

మైనర్లు..విద్యార్థులు..యువతే టార్గెట్‌గా..

జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేయడానికి ఎన్ని ప్ర యత్నాలు చేసినా దందా మాత్రం యథేచ్చగా సాగుతోంది. మైనర్లు, విద్యా ర్థులు, యువతే టార్గెట్‌ చేసుకొని గంజాయి విక్రయిస్తున్న ముఠాలు, గం జాయి అక్రమ రవాణాకు సైతం విద్యార్థులనే ప్రోత్సహిస్తున్నారు. పలువు రు విద్యార్థులు అర్ధాంతరంగా చదువులు మానేసి గంజాయి రవాణా చే స్తున్నారు. తాజాగా విశాఖ, సీలేరు ప్రాంతాల నుంచి జగిత్యాలకు తీసుకవ స్తున్న అయిదుగురు యువకులను పోలీసులు పట్టుకోవడంతో ఈ విష యం వెలుగులోకి వచ్చింది. గంజాయిని విద్యార్థులకు సరఫరా చేస్తూ వచ్చి న డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. పలువురు విద్యార్థులు, యువత తల్లి దండ్రులకు తెలియకుండా అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారు.

ప్యాకెట్లు, చాక్లెట్ల రూపంలో...

పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి జిల్లాకు గంజాయిని అక్రమంగా రవా ణా చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన గంజాయిని ప్యాకెట్ల రూ పంలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పలు ప్రాంతాల్లో చాక్లెట్‌ రూపంలో సైతం విక్రయిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రా ప్రాంతం నుంచి పలువురు యువకులు బైక్‌లు, ఇతర వాహనాల్లో తీసుకొస్తుండగా, ఆంధ్రా నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యే కొబ్బరి బోండాలు, ఇతర వాహనా ల్లో సైతం గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు, ఇతర జన సంచార ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న టేలాలు, పాన్‌ డబ్బాలు, చిన్న చిన్న కిరాణాలు, సిగరెట్‌ అడ్డాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో ప్యాకెట్‌ రూ. 500 నుంచి రూ. 1,000 వరకు, పావు కిలో సుమారు రూ. 3,500, అర్ధకిలో సుమారు రూ. 6,500 కిలో సుమారు రూ. 13,000 వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో చాక్లెట్‌ రూ. 30 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు..

మత్తు పదార్థాలకు అలవాటైన యువతీ యువకులు, విద్యార్థులు ప్ర త్యే కంగా వాట్సాప్‌ గ్రూపులు తయారు చేసుకుంటున్నట్లు అనుమనాలున్నా యి. విద్యార్థులు, యువతీ యువకులకు అలవాటు అయ్యే వరకు తక్కువ ధరకు, ఉచితంగా అందిస్తున్న మత్తు పదార్థాలను తదుపరి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కోడ్‌ భాషాలలో చాటింగ్‌ చేస్తూ మత్తు పదా ర్థాలు ఎక్కడ, ఎప్పుడు సరఫరా చేస్తారో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటు న్నట్లు సమాచారం.

జగిత్యాల కేంద్రంగా నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ విక్రయాలు...

జగిత్యాలకు చెందిన ఓ వైద్యుడు ఇటీవల ప్రాణాంతక మత్తు మందును పక్కదారి పట్టిస్తున్న సంఘటనను డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటి అధికారులు వె లుగులోకి తెచ్చారు. మార్ఫిన్‌ లాంటి మత్తు వచ్చే నార్కోటిక్‌ ఇంజక్షన్లు, మాత్రలను జిల్లాతో పాటు హైద్రాబాద్‌ వంటి ప్రాంతాల్లో పలువురు మ త్తుకు బానిసైన వారికి పార్సిల్‌ ద్వారా అందజేస్తున్న తీరు కలకలం రేపిం ది. జగిత్యాలకు చెందిన మానస హాస్పిటల్‌ ఈఎన్‌టీ వైద్యుడు మదన్‌ మో హన్‌ ఇటీవల హైద్రాబాద్‌లోని సైనిక్‌పురి ప్రాంతంలోని శ్రీసాయిబాబా ఆఫీసర్స్‌ కాలనీలో ఓ ఇంట్లో మార్ఫిన్‌ ఇంజక్షన్లు, మాత్రలు నిల్వ ఉంచి అధికారులకు పట్టుబడ్డాడు. ఈ మందులన్నీ జగిత్యాలలోని మానస హాస్పి టల్‌ నుంచి సదరు డాక్టర్‌ ద్వారా వచ్చాయని గుర్తించారు. జగిత్యాలలోని గొల్లపల్లి రోడ్డులో గల ఓ ఫార్మసీకి చెందినవిగా కనిపెట్టారు. నార్కోటిక్‌ డ్ర గ్స్‌ విక్రయాలు జరపడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మందుల వినియోగానికి రిజిస్టర్‌ నిర్వహించాలి. డాక్టర్ల సలహాలు, పర్యవేక్ష ణలో ఆపరేషన్‌ సమయంలో గానీ ఇతర అత్యవసర పరిస్థితుల్లో వినియో గించాల్సిన మత్తు మందులను విచ్చలవిడిగా నిల్వ చేయడం చర్చనీయాం శమైంది.

జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు..

పిల్లలు చెడు వ్యసనాలకు లోను కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు, పా ఠశాలల్లో ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలు, యువజన, మహిళా సం ఘాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు జరుగుతుందని పలు వురు అంటున్నారు. పిల్లల్లో విపరీత ప్రవర్తనను కనిపెట్టిన వెంటనే సదరు విద్యార్థులు, యువతకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం, మంచి, చెడుల గురించి వివరించడం, మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల ఎదరయ్యే దుష్పా భావాలు వివరించి, సత్ప్రవర్తన వైపు మలిగేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - Mar 27 , 2024 | 12:42 AM

Advertising
Advertising