ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సింగపూర్‌ పరారైన కల్వకుంట్ల కన్నారావు ?

ABN, Publish Date - Mar 24 , 2024 | 04:45 AM

ఓ భూఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్‌ కన్నారావు సింగపూర్‌ పరారైనట్టు సమాచారం.

ఓ భూఆక్రమణ కేసులో ప్రధాన నిందితుడు

ఆదిభట్ల, మార్చి 23(ఆంధ్రజ్యోతి): ఓ భూఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్‌ సోదరుడి కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్‌ కన్నారావు సింగపూర్‌ పరారైనట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మన్నెగూడ పరిధి సర్వే నంబర్‌ 32లో ఉన్న 2.15ఎకరాలకు సంబంధించిన భూవివాదంపై ఓఎ్‌సఆర్‌ ప్రాజెక్ట్స్‌ డైరక్టర్‌ శ్రీనివాస్‌ ఈ నెల 3న ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కల్వకుంట్ల కన్నారావు సహా 38 మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కన్నారావు ప్రధాన అనుచరుడు డేనియల్‌ సహా ఎనిమిది మందిని ఇప్పటిదాకా రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో జక్కిడి సురేందర్‌రెడ్డి, జక్కిడి హరినాథ్‌, కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్‌ కన్నారావు, శివ, డేనియెల్‌ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీళ్లలో నలుగురిని ఇప్పటికే రిమాండ్‌ చేశారు. అయితే, తనపై ఆదిభట్ల పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఽకన్నారావు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. అయితే, కన్నారావు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్న డేనియల్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం కన్నారావు సింగపూర్‌ పారిపోయినట్టు తెలుస్తోంది. దీంతో కల్వకుంట్ల కన్నారావును పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

Updated Date - Mar 24 , 2024 | 04:45 AM

Advertising
Advertising