విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండే!
ABN, Publish Date - Apr 04 , 2024 | 05:03 AM
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని అసిస్టెంట్ కమిషనర్లకు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు హెచ్చరించారు. దేవాదాయశాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు
ఉద్యోగులకు దేవాదాయశాఖ కమిషనర్ హెచ్చరిక
బాసర/ హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదని అసిస్టెంట్ కమిషనర్లకు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు హెచ్చరించారు. దేవాదాయశాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు ఆలయ ఆస్తులు, కోర్టు కేసులతో పాటు పలు ఇతర కీలక అంశాలపై బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఆలయ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసుల్లో నిర్లక్షం వహించినా, ఆలయ ఆస్తులు కాపాడటంలో విఫలమైనా, విధినిర్వహణలో అలసత్వం వహించినా ఏ మాత్రం ఉపేక్షించేది లేదని అధికారులకు కమిషనర్ హెచ్చరించారు. గోపన్‌పల్లి భూములకు సంబంధించి ఇప్పటి వరకు కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడం పట్ల సంబంధిత అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణకు గురైన భూముల్ని గుర్తించి రెవెన్యూశాఖ సహకారంతో స్వాధీనం చేసుకోవాలన్నారు. వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీడ, చల్లని తాగునీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే నిర్మల్ జిల్లా బాసర దేవస్థానంలో కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలను గురించి ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో దేవాదాయశాఖ కమిషనర్ హన్మంత్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. బాసరలో విచారించి అవకతవకలు వెలుగులోకి రావడంతో.. ఇకపై కొత్త కాంట్రాక్టులన్నీ పెండింగ్‌లో ఉంచాలని ఆదేశించారు. కొత్త టెండర్లలో వేసిన ధరలు, మార్కెట్‌లో ఉన్న ధరలను పరిశీలించాకే ఆమోదించాలని నిర్ణయించారు.
Updated Date - Apr 04 , 2024 | 08:43 AM