Abids fire accident: అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బాణాసంచా దుకాణంలో ఎగసిపడుతున్న మంటలు
ABN, Publish Date - Oct 27 , 2024 | 09:55 PM
నగరంలోని అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా దుకాణంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. టపాసులకు అంటుకోవడంతో అవి పేలుతున్నాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.
ప్రతీకాత్మక ఫొటో
హైదరాబాద్: నగరంలోని అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా దుకాణంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. టపాసులకు అంటుకోవడంతో అవి పేలుతున్నాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. బొగ్గులకుంటలోని మయూర్ పాన్ షాప్‌కు సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి రెండు ఫైరింజన్లు చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Updated Date - Oct 27 , 2024 | 09:55 PM