ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిందితుల బెయిల్‌ రద్దు కోరే హక్కు అప్రూవర్‌కు ఉంటుంది

ABN, Publish Date - Mar 29 , 2024 | 05:48 AM

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ 4వ నిందితుడు దస్తగిరి (అప్రూవర్‌) దాఖలు

దస్తగిరి పిటిషన్‌ను తిరస్కరించలేం

తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ

అవినాశ్‌ బెయిల్‌ రద్దుపై విచారణ 4వ తేదీకి వాయిదా

నిందితుల బెయిల్‌ రద్దు కోరే హక్కు అప్రూవర్‌కు ఉంటుంది

దస్తగిరి పిటిషన్‌ను తిరస్కరించలేం: హైకోర్టు

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ 4వ నిందితుడు దస్తగిరి (అప్రూవర్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారించింది. అప్రూవర్‌కు బెయిల్‌ రద్దు కోరే హక్కు లేదని అవినాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి చేసిన వాదనలతో ఏకీభవించలేదు. ఇటీవల ఎన్‌ఐఏకు సంబంధించిన ఓ కేసులో బెయిల్‌ రద్దు కోరే అధికారం అప్రూవర్‌కు ఉందని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసిందని పేర్కొంది. దస్తగిరి పిటిషన్‌ను తోసిపుచ్చలేమని తేల్చిచెప్పింది. ప్రస్తుత పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ఉత్తర్వులిచ్చారు. కాగా... ఈ కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లను వ్యతిరేకిస్తూ సీబీఐ కౌంటర్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ ఏప్రిల్‌ 3కు వాయిదా పడింది. సునీల్‌ యాదవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 12కు వాయిదా పడింది.

Updated Date - Mar 29 , 2024 | 05:48 AM

Advertising
Advertising