ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై వేధింపులు

ABN, Publish Date - Mar 28 , 2024 | 11:48 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ సంస్థలను ఉపయోగించి ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు పల్లా వెంకట్‌రెడ్డి

మునుగోడు, మార్చి 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ సంస్థలను ఉపయోగించి ప్రత్యర్థులను వేధింపులకు గురిచేస్తోందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడులో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని బీజేపీ ఏతర పార్టీల నేతలను పలు అక్రమ ఆరోపణలు చేస్తూ ప్రధానంగా మనీలాండరింగ్‌ కేసుల పేరుతో ఈడీ, సీబీఐ వంటి స్వతంత్ర సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని స్వప్రయోజనాలకు వాడుకొంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఢిల్లీ, తెలంగాణ, కేరళ, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రతిపక్షాల ప్రజాప్రతి నిధులపై అక్రమ కేసులు మోపి జైళ్లలో బంధించడం శోచనీయమన్నారు. ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో బాధ్యులైన బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి తగిన బుద్ధిచెబుతారని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, జిల్లా కమిటీ సభ్యుడు గురిజ రామచంద్రం, మండల సమితి కార్యదర్శి చాపల శ్రీను, గట్టుపల్లి నర్సిరెడ్డి, వెంకటేశ్వర్లు, కైలాసం పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:48 PM

Advertising
Advertising