‘పామాయిల్’కు ప్రాధాన్యమివ్వండి
ABN, Publish Date - Dec 07 , 2024 | 01:02 AM
కోదాడ రూరల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పామాయిల్ పంట లకు రైతులు ప్రాధా న్యమివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు.
కోదాడ రూరల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పామాయిల్ పంట లకు రైతులు ప్రాధా న్యమివ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపు గల్లు గ్రామంలో రూ.20కోట్ల అం చనాతో కాపుగల్లు నుంచి రెడ ్లకుంట వరకు నిర్మించ తలపెట్టిన రహదారి నిర్మాణ పనులకు మంత్రు లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులను సుసంపన్నం చెయ్యాలన్నది ప్రభుత్వ సంకల్ప మన్నారు. అందుకు అను గుణంగా రైతులు అవకాశం ఉన్న ప్రతిచోట పామాయిల్ తోటలు వేయాలని సూచించారు. పామాయిల్ పంటల సాగుకు రూ.51వేలు సబ్సిడీ అందిం చడంతో పాటు పండిన పంటను రైతు దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు చేసిన మూడు రోజులకే చెల్లింపులు ఉంటా యన్నారు. వరికి ఏడాదికి రెండుసార్లు కొనుగోళ్లు, చెల్లింపులు ఉంటే పామాయిల్ పంటకు ప్రతి నెల రెండుసార్లు ఉంటుందన్నారు. పామాయిల్ పంట వేసిన రైతులకు అంతర్ పంట వేసుకునే వెసులుబాటు ఉంటుందని, తద్వారా రైతులు రెండు రకాలుగా లబ్ధి పొందవచ్చన్నారు. ప్రభుత్వం రైతుల మేలు కోరుతోందని, రైతుల కోసం క్లిష్ట సమ యంలోనూ రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.7,625కోట్ల రైతు బందు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేశామని, రూ.3000కోట్లు రైతు బీమా కు కేటాయించామన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి నుంచి రైతుభరోసా అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సాధించిన పురోగతిని ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 07 , 2024 | 01:02 AM